కన్నడంలో రూపొందిన 'దండుపాళ్యం' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు మరియు తమిళంలో కూడా దండుపాళ్యం చిత్రంకు ఆధరణ రావడంతో ఆ చిత్రానికి వరుసగా సీక్వెల్స్ వస్తున్నాయి. ఇప్పటికే మూడు దండుపాళ్యం చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. దండుపాళ్యం 4 కు ఏమాత్రం ఆలస్యం చేయవద్దని మూడవ పార్ట్ విడుదలైన రోజే కొత్త సీక్వెల్ పనులు మొదలు పెట్టారు. గత ఏడాది అక్టోబర్ లోనే షూటింగ్ ను పూర్తి చేశారు. సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులకు సెన్సార్ బోర్డు పెద్ద షాక్ ఇచ్చింది.
దండుపాళ్యం మొదటి మూడు పార్ట్ ల్లో హింస, వల్గర్ తో పాటు కొన్ని మామూలు సీన్స్ కూడా ఉన్నాయి. కాని ఈ నాల్గవ పార్ట్ లో మాత్రం పూర్తిగా వల్గర్ సీన్స్ మరియు చంపుకోవడం, నరుక్కోవడం అత్యంత దారుణంగా ఉందని, ఈ సినిమాకు సెన్సార్ క్లీయరెన్స్ ఇవ్వలేం అంటూ సెన్సార్ బోర్డు తేల్చి చెప్పింది. గత నవంబర్ నుండి ఈ సినిమా సెన్సార్ కోసం నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుండగా, పలు అడ్డంకులు చెప్పిన సెన్సార్ బోర్డు ఇప్పుడు ఏకంగా ఈ చిత్రంకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
ఈ చిత్ర నిర్మాతలు మొదట నిర్మాతల మండలి వద్దకు వెళ్లనున్నాడు. అక్కడ కూడా న్యాయం జరగకుంటే సెన్సార్ బోర్డు తీరుపై కోర్టుకు వెళ్లేందుకు అయినా సిద్దం అంటూ నిర్మాతలు అంటున్నారు. దండుపాళ్యం 4 చిత్రం జనాలు చూసే విధంగా లేదని, మరీ హింసాత్మకంగా ఉందని, ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఈ సినిమాకు తక్కువే అంటూ సెన్సార్ బోర్డు సభ్యులు వాదిస్తున్నారు. కొన్ని సీన్స్ కట్ చేసి ఏ ఇచ్చే రీతిలో కూడా లేదని సెన్సార్ సభ్యులు అంటున్నారట.
Full View