బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తాజా చిత్రం దంగల్ భారతీయ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. మహిళా రెజ్లర్ గీతా ఫోగట్ జీవిత కథ ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్... గీతా తండ్రి మహావీర్ ఫోగట్ పాత్రలో ఒదిగిపోయారు. భార్య, మరో మిత్రుడితో కలిసి ఈ చిత్రాన్ని తీసిన ఆమిర్... అనుకున్న దాని కంటే ఎక్కువగానే సాధించేశారు. అటు రికార్డుల పరంగానే కాకుండా ఇటు కలెక్షన్ల పరంగానూ చిత్రం సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కరెన్సీ కష్టాలున్నప్పటికీ దంగల్ చిత్రం ద్వారా ఆమిర్ జనాన్ని థియేటర్ల ముందు క్యూ కట్టేలా చేశారు.
ఇక చిత్రంలోని గీతా - ఆమె సోదరి బబితా ఫోగట్ పాత్రల విషయానికొస్తే... చాలా ఆశ్చర్యంగా అనిపించక మానదు. నిజ జీవితంలో గీతా, బబితాలు తమ ఊళ్లోని ఆకతాయి అబ్బాయిలకు బుద్ధి చెప్పడం, ఆ తర్వాత వారిలోని ప్రతిభను చూసి మహావీర్ వారిని మహిళా రెజ్లర్లుగా తీర్చిదిద్దిన వైనం నిజంగా ఆసక్తికరమే. ఈ ఇంటరెస్టింగ్ పాయింట్‌ను ఎక్కడ కూడా మిస్ కాకుండా... నిజ జీవితంలో కంటే కూడా రీల్ లైఫ్ లోనే ఆమిర్ మరింత ఆసక్తికరంగా మార్చేశారని చెప్పక తప్పదు. పాత్రల కోసం నటీ నటుల ఎంపిక విషయంలో ఆమిర్ చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అందరి కంటే భిన్నంగా ఆలోచించిన వైనమే ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తున్నాయి. సాధారణంగా చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుల వయసును మనం అంచనా వేయలేమనే చెప్పాలి. ఇక్కడ కూడా ఆమిర్ మనలను ఇలాగే బోల్తా కొట్టించేశారు.
గీతా ఫోగట్ పాత్ర విషయానికి వస్తే... గీతా చిన్న బాలికగా ఉన్న పాత్ర కోసం ఆమిర్ ఎంపిక చేసిన బాల నటి పేరు జరా వాసిమ్. 16 ఏళ్ల వయసున్న ఆ బాలిక చిత్రంలో పదేళ్ల వయసున్న బాలికలాగానే కనిపించేసింది. ఇక గీతా ఫోగట్ పాత్ర విషయానికిస్తే... ఫాతిమా షేక్ ఈ పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పాలి. 24 ఏళ్ల వయసున్న ఫాతిమా... అబ్బాయి హెయిట్ కట్ లో గీతాను మన కళ్ల ముందు ప్రత్యక్షం చేసేసింది. ఇక ఫాతిమా చిన్నగా ఉన్నప్పుడే తెరంగేట్రం చేసిందట. అప్పుడెప్పుడో కమల్ హాసన్ తీసిన మల్టీ ల్యాంగ్వేజ్ మూవీ భామనే... సత్యభామనే (హిందిలో చాచీ 420) చిత్రంలో కమల్ కూతురిగా నటించింది చిన్నారి ఫాతిమానేనట. ఇక దంగల్ బబితా పాత్ర విషయానికి వస్తే... 10 ఏళ్ల సాహ్ని భట్నాగర్ చిన్న నాటి బబితా పాత్రలో నటించింది. ఇక రెజ్లర్‌గా మారిన బబితా ఫోగట్ పాత్రకు సాన్యా మల్హోత్రాను ఆమిర్ ఎంపిక చేసుకున్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/