అదిరిపోయే రికార్డు దంగల్ సొంతం

Update: 2017-01-15 14:37 GMT
ఇండియన్ సినిమాకున్న కెపాసిటీ ఏమిటన్నది తాజాగా మరోసారి ప్రూవ్ అయ్యింది. భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించలేని అరుదైన ఒక రికార్డును అమీర్ ఖాన్ నటించిన దంగల్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అమీర్ నటించిన పీకే.. సల్మాన్ నటించిన భజరంగీ భాయిజాన్ లు ఉన్నాయి.

పీకే రూ.340.8 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకోవగా.. భజరంగీ రూ.320.34 కోట్లను రాబట్టింది. కుస్తీ క్రీడ ప్రధానాంశంగా ఒక రియల్ కథను రీల్ కథగా మార్చిన దంగల్ తాజాగా రూ.400కోట్ల కలెక్షన్ కు చేరువైంది. తాజా అంచనాల ప్రకారం ఈ ఆదివారం పూర్తి అయ్యే నాటికి దంగల్ కలెక్షన్లు రికార్డు స్థాయికి చేరువ అవుతుందని.. త్వరలో ఇది రూ.400 కోట్ల మార్క్ ను దాటటం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటివరకూ దంగల్ కలెక్షన్ రూ.365.87 కోట్లుగా ఉంది. శనివారం ఈ సినిమాకు రూ.4.06 కోట్లు వచ్చాయి. అంటే.. రూ.370 కోట్లకు చేరువైనట్లే.

ఆదివారం కలెక్షన్లు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉండే వీలుంది. అంటే.. ఈ సినిమా బిజినెస్ క్లోజ్ చేసే నాటికి రూ.400కోట్ల మార్క్ ను క్రాస్ చేయటం ఖాయమన్న మాటను సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ భారీ కలెక్షన్లలో ఓవర్సీస్ కలెక్షన్ల వాటా సగం ఉండటం గమనార్హం. శనివారం నాటికి మొత్తం కలెక్షన్లలో ఒక్క ఓవర్ సీస్ నుంచే రూ.190.94 కోట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. దంగల్ బిజినెస్ క్లోజ్ చేసే సమయానికి రేర్ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News