వామ్మో.. దంగల్ కి అంత పలికిందా..

Update: 2016-12-16 03:59 GMT
బాలీవుడ్ సినిమాల్లో ఆమిర్ ఖాన్ బొమ్మలకు బాగా క్రేజ్ ఉంటుంది. థియేటర్లోనే కాదు.. టీవీల్లో ప్రదర్శించేటప్పుడు కూడా ఈ మిస్టర్ పర్ఫెక్ట్ నటించిన మూవీస్ కి టీఆర్పీలు బాగా వస్తాయి. అందుకే శాటిలైట్ రైట్స్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తుంటాడు ఆమిర్. ఇప్పుడు దంగల్ విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది.

డిసెంబర్ 23న విడుదల కానున్న దంగల్ పై ఇప్పటికే బోలెడన్ని అంచనాలున్నాయి. సౌత్ లో తెలుగు సహా పలు డబ్బింగ్ వెర్షన్స్ ని కూడా వదులుతుండడంతో.. కలెక్షన్స్ సునామీ ఖాయమనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో దంగల్ చిత్రానికి శాటిలైట్ రైట్స్ పలికిన రేట్ వింటే.. ఔరా అనిపించక మానదు. జీ టీవీ దంగల్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోగా.. ఇందుకోసం ఏకంగా రూ. 75 కోట్లను ముట్టచెప్పేందుకు డీల్ కుదుర్చుకుంది. ఇప్పటివరకూ ఇండియాలో ఇదే హైయెస్ట్ రికార్డ్.

గతంలో కూడా రికార్డ్ ఆమిర్ ఖాన్ పేరు పైనే ఉండడం విశేషం. మిస్టర్ పర్పెక్షనిస్ట్ నటించిన ధూమ్ 3 చిత్రం శాటిలైట్ కు.. అప్పట్లో 65 కోట్లు చెల్లించగా.. ఇప్పుడా రికార్డును దంగల్ తో తనే బద్దలు కొట్టేశాడు. ఈ మూవీకి నిర్మాత కూడా ఆమిర్ ఖానే అని తెలుసు కదా. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ కి ఓ 30శాతం వాటా ఉందంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News