క్రేజు ఉన్న సినిమా వస్తోంది అంటే చాలు. డిస్ట్రిబ్యూషన్ వర్గాల మధ్య అసలైన వార్ మొదలవుతుంది. అప్పటివరకూ స్నేహితులుగా ఉన్నవాళ్లే శత్రువులుగా మారి కొప్పులు పట్టుకుని గుంజుకుంటారు. ఈ వార్ ఏ స్థాయిలో ఉంటుంది? అన్నదానికి 2.0 రైట్స్ విషయంలో జరిగిన పెను యుద్ధమే ఓ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అప్పట్లో 2.0 రిలీజ్ హక్కుల విషయంలో ఓ రెండు ప్రధాన పంపిణీ అలెయెన్స్ వర్గాల మధ్య జరిగిన పెను యుద్ధాన్ని పరిశ్రమ వర్గాలు అంత తేలిగ్గా మర్చిపోలేవు. అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు కం ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు అంతటి వాడికే 2.0 రైట్స్ విషయంలో పోటీ తప్పలేదు. ప్రముఖ పంపిణీదారుడు ఎన్వీ ప్రసాద్ ఓవర్ నైట్ లో సీన్ మొత్తం మార్చేశారు. 2.0 హక్కుల్ని యు.వి.క్రియేషన్స్ - దిల్ రాజు అలయెన్స్ చేతికి చిక్కేలా చేశారు. ఒక రకంగా ఈ రంగంలో దిగ్గజాలం అని చెప్పుకునే డి.సురేష్ బాబు- సునీల్ నారంగ్ అలెయెన్స్ నే `గింజే` అనిపించిన సన్నివేశమది. 2.0 పంపిణీ హక్కుల పంచాయితీల లొల్లు అప్పట్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది.
అయితే ఇప్పుడు అదే తరహాలో `సైరా` రిలీజ్ హక్కుల విషయంలో రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య వార్ నడుస్తోందని తెలుస్తోంది. సహజంగానే భారీ చిత్రం రిలీజ్ కి వస్తోంది అంటే పంపిణీదారుల మధ్య పోటీ ఉంటుంది. ఒకరిని మించి ఒకరు ధరల్ని పెంచేస్తూ పోటీపడుతుంటారు. అలాంటి వార్ ఈసారి `సైరా: నరసింహారెడ్డి` ఉత్తరాంధ్ర హక్కుల విషయంలో నెలకొందని ట్రేడ్ ముచ్చటించుకుంటోంది. ఏపీకి చెందిన ప్రముఖ సీనియర్ ఎగ్జిబిటర్ క్రాంతి రెడ్డికి .. నైజాం కింగ్ దిల్ రాజుకు మధ్య ఒక రకంగా సైరా ఉత్తరాంధ్ర హక్కుల విషయంలో వార్ నడుస్తోందట. దాదాపు 15 కోట్ల మేర విశాఖపట్నం టౌన్ సహా ఉత్తరాంధ్ర రిలీజ్ హక్కుల కోసం క్రాంతి రెడ్డి కొణిదెల కంపెనీకి ఆఫర్ చేశారట. అందుకు ఆల్మోస్ట్ బేరం ఖాయమైందని మాట్లాడుకున్నారు ట్రేడ్ లో. క్రాంతి రెడ్డికి ధీటుగానే పలువురు పంపిణీదారులు ఇంచుమించు 13 కోట్ల వరకూ పోటీనిచ్చారని తెలిసింది.
అయితే ఇంతలోనే నైజాం కింగ్ దిల్ రాజు గేమ్ లో జాయిన్ అవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం `సైరా-నరసింహారెడ్డి` ఉత్తరాంధ్ర రైట్స్ కి ఇంచుమించు 15 కోట్ల వరకూ చెల్లించేందుకు దిల్ రాజు వెనకాడడం లేదట. ఎట్టి పరిస్థితిలో మెగాస్టార్ చిరంజీవి సినిమాని తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే యువి క్రియేషన్స్ తో కలిసి దిల్ రాజు నైజాం హక్కుల్ని 30 కోట్లకు లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలోనూ ఇతర పంపిణీదారులందరికీ చెక్ పెట్టేస్తూ దిల్ రాజు సైరాని గుప్పిట్లో బంధించేస్తున్నారని మాట్లాడుకుంటున్నారంతా.