అనుకుంటాం కానీ.. సినిమా హీరోల రెమ్యునరేషన్స్ మామూలుగా ఉండవు కదా! ప్రస్తుత ప్రపంచంలో సినిమా హీరోలు - హీరోయిన్ల రెమ్యునరేషన్స్ వారే డిమాండ్ చేస్తున్నారా లేక ఆయా సంస్థలు వీరి వీరి పాపులారిటీని క్యాష్ చేసుకునే క్రమంలో అలా ఆఫర్స్ ఇచ్చేస్తున్నాయో తెలియదు కానీ.. ప్రస్తుతం ఒక హాలీవుడ్ హీరోకి 150 మిలియన్ డాలర్లు (రూ.996కోట్లు) ఆఫర్ ప్రకటించారు సోనీ సంస్థ నిర్మాతలు. ఈ విషయాన్ని రాడార్ ఆన్ లైన్ తాజాగా తెలిపింది.
సినిమాలందు జేమ్స్ బాండ్ సినిమాలు వేరయా అన్నట్లు నెక్స్ట్ రాబోయే జేమ్స్ బాండ్ ఎవరు అన్నదానిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా తదుపరి జేమ్స్ బాండ్ గా డానియెల్ క్రేయిగ్ నే కొనసాగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఏజెంట్ 007గా మరో రెండు సినిమాలు నటించేస్తే ఆయనకు 150 మిలియన్ డాలర్లు పారితోషకంగా ఇస్తామన్నారంట నిర్మాతలు. ఈమేరకు బాండ్ గా క్రెయిగ్ ను ఒప్పించేందుకు సోనీ సంస్థ తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నదని, అందులో భాగంగా ఈస్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేసిందని రాడార్ వెబ్ సైట్ తెలిపింది. దీనికి కారణం.. ఇప్పటికిప్పుడు బాండ్ పాత్రలో కొత్త వ్యక్తిని తీసుకోవడం సోనీకి ఏమాత్రం ఇష్టం లేదని - తదుపరి రెండు సినిమాలకు కూడా క్రెయిగ్ ఉంటేనే బాగుంటుందని సోనీ యజమానులు భావిస్తున్నారట.
"కావాలంటే నా మణికట్టు కోసుకోమన్నా కూడా కోసుకుంటాను కానీ.. ఇకపై బాండ్ పాత్రను మాత్రం చేయను. ఈ పాత్రలో చేసే స్టంట్లతో నా ఒళ్లంతా హూనం అయిపోయింది" అని క్రెయిగ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా "స్పెక్టర్" సినిమాతో 007గా క్రెయిగ్ అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాతే ఇక బాండ్ సిరీస్ సినిమాల్లో నటించబోనని ఆయన తేల్చిచెప్పారు.