సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడి గా నటించిన దర్బార్ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని ఎన్ .వి ప్రసాద్ తెలుగు ప్రేక్షలకు అందిస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుకను శిల్పకళా వేదికలో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుక కు విచ్చేసిన రజనీ సైతం షాక్ అయ్యారు. ఇంత గ్రాండ్ గా అభిమానుల మధ్యలో ఈవెంట్ జరుగుతుందని అనుకో లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. అనంతరం సినిమాను పైకి లేపే ప్రయత్నం చేసారు. అదే సమయంలో ఎన్ వి ప్రసాద్ గురించి ఆసక్తికరంగా స్పందించారు. సినిమా విజయం సాధించినా..సాధించకపోయినా ఎప్పుడూ ఒకలాగే ఉంటారు.
విజయంతో పొంగిపోరు...అపజయంతో కృంగిపోరు. ఎప్పటి నుంచో బాగా తెలిసిన వ్యక్తి అని రజనీ వ్యాఖ్యానించడంతో ఆ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి అర్ధమైంది. రజనీ నుంచి ఎన్ వి ప్రసాద్ కి దక్కిన గొప్ప ప్రశంసే ఇది. అయితే ప్రశంసలుడబ్బుల తీసుకురావన్నది అందరికీ తెలుసు. ఆ విషయం పక్కనబెడితే ఈసినిమా తెలుగు రైట్స్ సదరు నిర్మాత14 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిసింది. రెండు రాష్ర్టాల రిలీజ్ హక్కులు పోటీ నడుమ అంతకు పరుగులెట్టినట్లు పోటీ దారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఎక్కువగానే పెట్టారని ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర ముచ్చటా సాగుతోంది.
గత కొన్నేళ్లగా సూపర్ స్టార్ సినిమాలు ఇక్కడ పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు. భారీ ధరకు రైట్స్ అయితే అమ్ముడుపోతు న్నాయిగానీ! రిటర్న్స్ తీసుకురావడం లేదు. కొచ్చాడయన్ దగ్గర నుంచి పేట వరకూ ఏ సినిమా అంచనాలు అందుకోలేక పోయాయి. మరి దర్బార్ వాటిని బ్రేక్ చేసి ముందుకెళ్లాల్సి ఉంది. తొలి షోతోనే బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే సూపర్ స్టార్ క్రేజ్ తో అసాధారణ వసూళ్ల వైపు పరుగులు పెట్టడం ఖాయం. తర్వాతి రెండు రోజుల గ్యాప్ లో వచ్చే ఇద్దరు స్టార్ హీరోల సినిమాల పోటీని కూడా తట్టుకుని నిలబడగలిగాలి.