సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ 2.0 చిత్రం కోసం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులను తీసుకుంటున్నారు. దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్ తో.. ఇండియాలో అత్యంత రిచ్ గా తెరకెక్కనున్న 2.0.. దేశీయ సినీ పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దేందుకు శంకర్ ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ని విలన్ రోల్ లో చూపిస్తున్న శంకర్.. టెక్నీషియన్ల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2.0కి స్టంట్స్ అందించేందుకు మిషన్ ఇంపాజిబుల్ - ట్రాన్స్ ఫార్మర్స్ వంటి చిత్రాలకు పని చేసిన కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. ఇప్పుడు మరో హాలీవుడ్ టెక్నీషియన్ ను కూడా రంగంలోకి దించారు. ది డార్క్ నైట్ - వాంటెడ్ వంటి మూవీస్ కి పని చేసిన ఆరోన్ క్రిప్పెన్ అనే స్టంట్ మాస్టర్ కూడా తీసుకోవడం విశేషం. పలు యాక్షన్ సన్నివేశాలకు ఈయన స్చంట్స్ సమకూర్చనున్నాడు. కార్ క్రాష్ లు - బాంబ్ పేలుళ్లు వంటి సీన్లను పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తాడని ఆరోన్ కి పేరు ఉంది.
ప్రస్తుతం కబాలి షూటింగ్ ని ఫినిష్ చేస్తున్న రజినీకాంత్.. రోబో సీక్వెల్ లో కూడా ఒకేసారి నటిస్తున్నారు. తమిళనాట ఎన్నికల తర్వాత కబాలి విడుదల కానుండగా.. రోబో 2.0 మాత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి.