తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ది ఒక స్టయిల్. ఆ తరువాత ఏఎన్నార్‌ది ఒక స్టయిల్. ఇక ప్రస్తుత ప్రభంజనం పవన్ కళ్యాణ్‌ది మరొక స్టయిల్. పవన్ వంటి స్టయిల్ కింగ్ డామినేట్ చేస్తున్న టైమ్‌లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్టయిల్‌ను క్రియేట్ చేసుకున్నాడు అర్జున్'' అంటూ సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్‌లో వ్యాఖ్యానించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఈ విషయంపై ఇప్పుడు టాలీవుడ్‌లో విస్తృతంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని దాసరి నారాయణరావు అవమానించారంటూ మెగా ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో నిప్పులు వెళ్లగక్కుతున్నారు.
అసలు ఎన్టీఆర్, ఏఎన్నార్ యుగం ముగుస్తూ.. సూపర్‌స్టార్ కృష్ణ రాజ్యమేలుతున్న రోజుల్లో స్వయంకృషితో దూసుకొచ్చిన ధృవతార చిరంజీవి. ఏకంగా 20 ఏళ్ళ పాటు బాక్సాఫీస్ దగ్గర నెం.1 స్థానంలో కొనసాగిన ఏకైక హీరో. ఇప్పుడున్న స్టార్ హీరోలకు సాధ్యం కాని ఫీట ఇది. అలాంటి మెగాస్టార్‌ను అసలు దాసరి నారాయణరావు ఎలా మర్చిపోతారు అంటూ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. అదీ నిజమే మరి. అసలు చిరంజీవి పేరు చెప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ మోడ్రన్ సినిమా చరిత్రను చెప్పడం అసాధ్యం. అటువంటి మెగాస్టార్‌ను మెగా ఈవెంట్‌లోనే కనీసం మాటవరుసకు కూడా టచ్ చేయకపోవడం విపరీతమైన సెటైర్‌గానే పరిగణించాలేమో మరి.
అసలు టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలు ఈరోజు డ్యాన్స్ గురించి ప్రస్తావించాలంటే మెగాస్టార్ చిరంజీవి నాకు స్ఫూర్తి అని చెబుతున్నారు. సాక్షాతూ పవన్, బన్నీలే ఎన్నోసార్లు ఆయనే ఆదర్శం అన్నారు. మెగా హీరోలే కాదు, బయట కూడా చాలామంది చిరు వీరాభిమానులే. ఒక ఐడాల్ స్థాయిలో అన్నేసి ఏళ్ళు టాలీవుడ్‌ను ఏలిన చిరంజీవిని దాసరి అసలు స్మరణ చేసుకోకపోతే ఫ్యాన్స్‌కు మండిపోదేంటి? మీ తరువాతి సినిమా హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించాలనే తొందరలో చిరంజీవి గురించి మర్చిపోయారా గురువుగారూ?
హైలైట్: కార్యక్రమం చివర్లో బన్నీ ఓ మాటన్నాడు.. అభిమానులు పవర్ స్టార్ అని అరుస్తుంటే.. ''దాని గురించి ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు'' అని చేత్తో అభివాదం చేసిన బన్నీ... ''నేను ఈ స్థాయిలో నిలబడటానికి కారణమైన మెగాస్టార్ ఫ్యాన్స్‌కు నా ధన్యవాదాలు'' అనేశాడు. అది సంగతి.