ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ మైదానంలోనే కాదు. టాలీవుడ్ లోనూ బాగా ప్రాచుర్యం పొందాడు. అన్నింటికంటే అతను తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకున్నాడు. ఇంతకుముందు ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ లో అతడి ఫేకింగ్ ఫేస్ కనిపించింది. అతని వీడియోలకు అభిమానులలో ఆదరణ ప్రత్యేకంగా ఉంది. ఇటీవలే అల వైకుంఠపురములో చార్ట్ బస్టర్ సాంగ్ ని ఫేకింగ్ ఫేస్ తో ఇమ్మిటేట్ చేయడం వేడెక్కించింది.
ఇటీవల డేవిడ్ వార్నర్ కాస్త స్తబ్ధుగా ఉన్నాడు. రెగ్యులర్ వీడియోల నుండి విరామం తీసుకున్నా.. అభిమానుల డిమాండ్ మేరకు మరో వీడియోతో రిటన్ వచ్చాడు. తాజా వీడియో మరోసారి సెన్సేషనల్ గా మారింది. సోషల్ మీడియాను ఈ వీడియో తుఫాన్ వేగంతో చుట్టేస్తోంది.
ఈసారి సంచలనాల `రౌడీ బేబీ` సాంగ్ ని డేవిడ్ వార్నర్ ఫేకింగ్ చేశాడు. డేవిడ్ తనను తాను ధనుష్ గా డీప్ ఫేక్ చేసాడు. ఈ పెప్పీ నంబర్ 2018లో విడుదలైన మారి 2 సినిమాలోనిది. ఇందులో ధనుష్ -సాయి పల్లవి డ్యాన్సులు ఒక సెన్సేషన్. ఇది అభిమానులలో బాగా ప్రాచుర్యం పొందింది. యూట్యూబ్ లో బిలియన్ వ్యూస్ తో రికార్డులు బ్రేక్ చేసిన సాంగ్ ఇది.
ఇప్పుడు డేవిడ్ వార్నర్ అనుకరణతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అతను వీడియోను ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. ``జనాదరణ పొందిన పాటను.. అభిమానుల డిమాండ్ మేరకు అందిస్తున్నాం..అంటూ వెల్లడించారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ కమ్ సోషల్ మీడియా స్టార్ తిరిగి ఫామ్ లోకి వచ్చారు! అంటూ అభిమానులు వ్యాఖ్యల విభాగంలో ఆయనను ప్రశంసించారు. ఒక ఇన్ స్టాగ్రామ్ యూజర్ “బాస్ ఈజ్ బ్యాక్” అని రాశారు. మరో అభిమాని.. టాలీవుడ్ సినిమాల్లోకి అడుగుపెట్టమని సూచించారు. నిజంగా మీరు వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతారు! థియేటర్లు మీ కోసం వేచి చూస్తున్నాయి! అంటూ చిలిపి వ్యాఖ్యానం చేశారు.