షారూక్ ను మోడీ ఏమీ చేయలేకపోయారు

Update: 2016-12-04 11:30 GMT
బాలీవుడ్ లో ఎంతమంది హీరోలు వచ్చి పోతున్నా షారూక్ ఖాన్ కు ఉన్న క్రేజే వేరు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. పెద్ద నోట్ల రద్దుతో సినిమా హాళ్లకు ఎవరూ వెళ్లడం లేదని అంటున్నారు.. అంతేకాదు... చాలా సినిమాల రిలీజ్ లు కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన షారూక్ డియర్ జిందగీ సినిమా డీమానిటైజేషన్ ఎఫెక్టును తట్టుకుని ఇప్పటికే 100 కోట్లు వసూలు చేయడం ఇండస్ర్టీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
    
ఐదు పదుల వయసు దాటిన షారుక్‌ఖాన్‌.. ఇరవయ్యేళ్ల ఆలియాభట్‌ కలిసి నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్సు వచ్చింది. పైగా ఈ చిత్రాన్ని 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' దర్శకురాలు గౌరీ షిండే తెరకెక్కించడంతో ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
    
సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు షారూక్ నటకు ఇంప్రెస్ అయ్యారు. ఇందులో షారుక్‌ ఖాన్‌ కూల్‌గా.. కొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక అలియా అందం సరేసరి.. ఇంకేముంది షారూక్ సినిమా నోట్ల రద్దు ఎఫెక్టు నుంచి ఈజీగా బయటపడిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News