శ్వేత బతికే ఉంది బాబూ!

Update: 2017-05-29 04:30 GMT
స్మాల్ స్క్రీన్ యాక్ట్రెస్ శ్వేతా తివారి చనిపోయిందని.. సోషల్ మీడియాలో బోలెడంత హంగామా నడిచిపోయింది. ఆన్ లైన్ మీడియాలో ఏదో ఒక సెలబ్రిటీపై ఇలాంటి హంగామా జరగడం జరుగుతూనే ఉండగా.. ఇప్పుడిందులో శ్వేతా తివారి చేరింది.

అసలు ఈ హంగామా ఎక్కడ మొదలైందంటే.. శ్వేత స్నేహితురాలు సాక్షి తన్వర్ ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టింది. తన ప్రియమైన స్నేహితురాలు చనిపోయినందుకు ఎంతో బాధగా ఉందంటూ సాక్షి తన్వర్ ట్వీట్ చేయడంతో.. శ్వేత-సాక్షిల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ తెలిసిన కొందరు.. శ్వేతా తివారి చనిపోయిందని పోస్ట్ లు చేయడం స్టార్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలోనే నివాళులు అర్పించడం.. ఫోటోలకు దండలు వేసేసి పోస్టులు పెట్టడం లాంటి హై లెవెల్ డ్రామా అంతా నడిచిపోయింది. చివరకు శ్వేత భర్త అభినవ్ కు ఫోన్ చేసి తమ సంతాపం కూడా వెలిబుచ్చారట పలువురు ప్రముఖులు.

ఈ దెబ్బకు షాక్ తినేసిన అభినవ్.. తన షూటింగ్ ను మధ్యలో ఆపేసి హడావిడిగా ఇంటికి వెళ్లిపోయాడట. అక్కడ తన భార్య మామూలుగానే ఉండడం చూసి రిలీఫ్ ఫీల్ అయిన అభినవ్.. కాసేపు సేదతీరి అప్పుడు అసలు విషయం చెప్పాడట. దీనికి శ్వేత తెగ నవ్వేసుకుందని చెబుతున్నాడు అభినవ్. దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించకండి అంటూ జనాలను వేడుకుంటున్నాడు శ్వేత భర్త అభినవ్. తనను ఇప్పటివరకూ ఇలా మూడు సార్లు చంపేశారని శ్వేతా తివారి చెప్పడం కొసమెరుపు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News