కొన్ని పేర్లు తెలుగు ప్రజలకు సుపరిచతం. కానీ.. వారు తెర మీదకు రారు. తెర వెనుక ఉంటూ కీ రోల్ ప్లే చేస్తుంటారు. ఊహించని రీతిలో తెర మీదకు వచ్చినప్పుడు అప్పటి వరకూ వారికున్న ఇమేజ్ కు భిన్నమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ నిర్మాత నల్లమలుపు బుజ్జి.
బెల్లంకొండ శ్రీనివాస్ కు బంధువైన బుజ్జి మరీ ఇంత ఓపెనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయటమే కాదు.. అవార్డుల ఎంపికలో కమ్మ లాబీయింగ్ బాగా ప్రభావం చూపిందంటూ.. రుద్రమదేవి.. మనం.. తాను తీసిన రేసుగుర్రం సినిమాకు ఎందుకు అవార్డులు రాలేదంటూ నిలదీస్తున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నంది అవార్డుల ప్రకటన మీద చోటు చేసుకున్న విమర్శల నేపథ్యంలో ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న బుజ్జికి ఇప్పుడు సరికొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. సినిమాలు తీయటమేకాదు ఎప్పుడూ తెర మీదకు వచ్చి మాట్లాడటం లేని నల్లమల బుజ్జి.. తాజాగా మాత్రం తన మాటలతో.. తన దూకుడుతో.. ఎటకారంతో తెలుగు ప్రజల్ని ఆకర్షిస్తున్నారు.
నంది అవార్డుల విషయంలో తప్పు జరిగిందన్న విషయాన్ని బండ్ల గణేశ్ లాంటి ప్రొడ్యూసర్ డిప్లమాటిక్ గా ఆచితూచి మాట్లాడుతూ.. కుల ప్రభావం లేదంటే బుజ్జి మాత్రం అందుకు భిన్నంగా కమ్మ కుల లాబీయింగ్ జరిగిదంటూ కుండ బద్ధలు కొట్టేశారు. ఈ డిబేట్ లో భాగంగా సి. కల్యాణ్ ఫోన్ ఇన్ లో బుజ్జిని తీవ్రంగా విమర్శిస్తే.. ఆయనపై ఒంటికాలి మీద లేవటమే కాదు.. సి కల్యాణ్ నోటికి తాళం వేసేలా బుజ్జి ఎటకారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
నిర్మాతగా మాత్రమే పరిచయమైన బుజ్జి ఇంత ఫైర్ బ్రాండా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. తాజాగా ప్రకటించిన నంది అవార్డులన్నీ దొంగ అవార్డులుగా ఆయన తేల్చేశారు. అవార్డుల కోసం రోడ్లు ఎక్కటం సరికాదంటూ సి.కల్యాణ్ అనటం తప్పని.. ప్రభుత్వం.. కమిటీ వన్ సైడ్ అయి అవార్డులు ఇచ్చారంటూ మండి పడ్డారు.
ఓ హిట్ సినిమా చేస్తే తమ బాధ అర్థమవుతుందన్న బుజ్జి మాటలు చూసినప్పుడు.. తనను అడగాలే కానీ ఏదైనా సరే.. ఓపెన్ గా చెప్పేయటానికి సిద్ధమన్నట్లుగా ఉన్నారని చెప్పక తప్పదు. ఈ డిబేట్‌లో బుజ్జిని మరిన్ని ప్రశ్నలు వేసి ఉంటే.. మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చేవని చెప్పక తప్పదు.