బి.కామ్ లో ఫిజిక్స్.. బిగ్ బాస్ లో మ్యాథ్స్

Update: 2017-09-09 11:43 GMT
తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే ప్రయత్నంలో బిగ్ బాస్ ను పరిచయం చేసిన స్టార్ మా ఇప్పుడు సరికొత్త ఆలోచనతో షో ను నడిపించడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం షో రేటింగ్ అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో బిగ్ బాస్ యాజమాన్యం హౌస్ లో ఉన్న వారికి కొత్త తరహా టాస్క్ లను ఇస్తుంది. దీంతో కంటెస్టెంటులు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎవరి స్థాయిలో వారు ప్రతిభను కనబరుస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బి.కామ్ లో ఫిజిక్స్ డైలాగ్ ని ఎవరు మర్చిపోలేరు. ఇప్పటికి ఆ డైలాగ్ ని ఫ్రెండ్స్ తో ఉన్నపుడు ఇతరులు చేసే పనులపై  ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే తరహాలో బిగ్ బాస్ లో తారల ఐక్యు లెవల్ పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా ప్రస్తుతం బిగ్ బాస్ లో గ్లామర్ తో అదరగొడుతున్న దీక్షా పంత్ నే కామెంట్ చేస్తున్నారు.  రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ లకి మ్యాథ్స్ కి సంబందించిన ఒక టాస్క్ ఇచ్చాడు. అయితే అందరు కొంతవరకు బాగానే ఆడారు. కానీ దీక్ష మాత్రం అతి చిన్న ప్రాబ్లమ్ ని కూడా సరిగ్గా సాల్వ్ చేయలేకపోయింది.

ఆమెకు ఇచ్చిన లెక్కను ఇలా చేసింది  -4+4 = ఎంత? దీంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. లెక్కల ప్రకారం ఆన్సర్ "0" అయితే అమ్మడు 8 అని వేయడంతో చిన్నపిల్లలు సైతం హవ్వా అనేట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా బి.కామ్ లో ఫిజిక్స్ అనే స్థాయిలో చేసిందని సైటైర్లు వెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆక  ఆ కంటెస్టెంట్స్ లో అందరికంటే బాగా ప్రిన్స్ ఆడి శబాష్ అనిపించుకున్నాడు.    


Tags:    

Similar News