దీపిక లుంగి డ్యాన్స్ జిమ్ వైర‌ల్

Update: 2020-03-05 07:45 GMT
లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్! అంటూ చెన్న‌య్ ఎక్స్ ప్రెస్ చిత్రంలో కింగ్ ఖాన్ షారూక్ చేసిన నృత్యాల్ని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. షారూక్ మైండ్ బ్లోయింగ్ కామెడీ ఫీట్స్ కి ఇటు చెన్న‌య్ బాక్సాఫీస్ ని ర‌ఫ్ఫాడేసింది ఈ సినిమా. ఇక ఇందులో దీపిక ప‌దుకొనే లుంగీ పంచె క‌ట్టి డ్యాన్సులు ఆడిన తీరును ప్ర‌తిసారీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

తాజాగా మ‌రోసారి దీపిక లుంగీ డ్యాన్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అయితే ఈసారి లుంగీ డ్యాన్స్ చాలా స్పెష‌ల్. ఇది జిమ్ లో లుంగీ డ్యాన్స్. ప్రముఖ శిక్షకురాలు యాస్మిన్ కరాచీవాలా ఆధ్వర్యంలో స్పెష‌ల్ శిక్ష‌ణ పొందుతున్న దీపిక ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బ‌రువైన తాళ్ల‌ను ఎత్తుతూ వార్ జోన్ లో ఉన్న సైనికురాలిలా క‌నిపిస్తోంది దీపిక‌. ఇక దీనికి కూడా అంత‌గా ఎంజాయ్ చేస్తూ లుంగీ డ్యాన్సాడేస్తుండ‌డం ఆక‌ట్టుకుంది.

క‌నీసం రోజులో ఎంతో నిరాస్త‌త‌తో జీవించేవారికి దీపిక  సిస‌లైన స్ఫూర్తి అనే చెప్పాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందాన్ని నిలుపుకునేందుకు ఈమాత్రం శ్ర‌మ త‌ప్ప‌నిస‌రి. నిరంత‌రం జిమ్ చేస్తేనే నేటి ఒత్తిళ్ల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలుంటుంద‌ని యువ‌త‌రానికి ఇలా చెప్ప‌క‌నే చెబుతోంద‌న్న‌మాట‌. చ‌పాక్ త‌ర్వాత దీపిక ప‌లు చిత్రాల‌కు క‌మిటైంది. భర్త ర‌ణ‌వీర్ తో క‌లిసి న‌టించిన‌ 83 చిత్రం ఏప్రిల్ 10 న థియేటర్లలోకి రానుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Tags:    

Similar News