నా జీవితం అంధకారంలో ఉన్నప్పుడు ఆమె కాపాడింది

Update: 2022-10-10 12:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకోనే గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారనే వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబయిలో కూడా ఆమె ను హుటా హుటిన ఆసుపత్రికి తీసుకు వెళ్లడం జరిగింది.

తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తాను చాలా డిప్రెషన్ కి గురి అయ్యాను.

నా తల్లిదండ్రులతో దూరంగా ఉంటున్న సమయంలో నా యొక్క మానసిక స్థితి చాలా దారుణంగా ఉండేది. వారు నా వద్దకు అప్పుడప్పుడు వచ్చిన సమయంలో నేను వారికి నార్మల్‌ గా కనిపించేందుకు ప్రయత్నించేదాన్ని.

ఒకానొక సమయంలో అమ్మ నన్ను నిలదీశారు. ఇలా ఎందుకు ఉంటున్నావు.. ఏం జరిగింది అంటూ ఆమె నన్ను ప్రశ్నించడంతో ఆ సమయంలో నా మానసిక పరిస్థితి గురించి.. నా డిప్రెషన్ గురించి ఆమెతో చెప్పాను. ఆ సమయంలో అమ్మ నన్ను అంధకారంలో ఉండగా కాపాడిందని దీపిక చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో అమ్మ నన్ను డిప్రెషన్ గురించి ప్రశ్నించి నాకు మద్దతుగా నిలిచి ఉండకుంటే నేను ఈ రోజు బతికి ఉండేదాన్ని కాదు అన్నట్లుగా ఆమె కామెంట్స్ చేసింది.

డిప్రెషన్ లో ఉన్న సమయంలో తప్పకుండా కుటుంబ సభ్యుల యొక్క సహాయం వారి యొక్క సహకారం తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు మాత్రమే డిప్రెషన్ సమయంలో సరిగ్గా అర్థం చేసుకుంటారని దీపిక అభిప్రాయం వ్యక్తం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News