హాలీవుడ్ లో బాలీ భామల పోటీ

Update: 2017-05-02 11:31 GMT
బాలీవుడ్ భామలు అయినా.. హాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న ఇద్దరు భామలు ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనే. సీరియల్ తో స్టార్ట్ చేసి.. ఫోటో సెషన్స్.. టీవీ షోస్ ను దాటి.. హాలీవుడ్ మూవీ వరకూ చేరుకుంది ప్రియాంక చోప్రా. లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. డైరెక్ట్ గా బాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో నటించేసి.. ఇప్పటికే రిలీజ్ కూడా చేసేసింది దీపికా పదుకొనే.

హాలీవుడ్ లో ఈ బాలీవుడ్ భామల పోటీ ఆసక్తికరంగానే ఉన్నా.. ఇద్దరూ ఇప్పటివరకూ ఒకే చోట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఒకే ఈవెంట్ లో ఈ ఇద్దరు అందగత్తెలు అందాలను కుమ్మరించేస్తూ కనిపించి సందడి చేశారు. న్యూయార్క్ సిటీలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ కోసం వార్షికం ఏర్పాటు చేసే నిధుల సేకరణ కార్యక్రమం.. మెట్ గాలాలో ఈ ఇద్దరు వయ్యారి భామలు తమ సొగసులను ధారపోశారు. ఇప్పటికే హాలీవుడ్ లో సెటిల్ అయియిన ప్రియాంక చోప్రా.. ఆ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా డ్రెసింగ్ చేసుకుని వచ్చేసి ఆకట్టుకుంది.

వైట్ కలర్ గౌన్ ఇండియన్ డ్రెసింగ్ కు మోడర్న్ హంగులు అద్దిన దీపిక కూడా ఆడియన్స్ బాగా అట్రాక్ట్ చేసింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ.. ఎవరు తక్కువ అని లెక్కలేసేందుకు వీలు లేని స్థాయిలో.. పిగ్గీ ఛాప్స్-డిప్స్ హంగామా చేయడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News