దీప్-వీర్ వెడ్డింగ్.. కండోమ్ కంపెనీలకు పండగ

Update: 2018-11-15 05:32 GMT
అందరూ ప్రేమ అనేది ఒక బ్రహ్మ పదార్థమని.. దాన్ని అర్థం చేసుకోవడం కష్టమని అంటారు. కానీ పెళ్ళి అనేది ఉందే అది ప్రేమ టు ది పవర్ ఆఫ్ ఎన్.  అందుకే పెళ్ళి మీద భార్య భర్తల మీద ఉన్నన్ని జోకులు వేరే ఏ టాపిక్ మీదకూడా మనకు దొరకవు.  సరే.. ఇప్పుడు మనకు ఈ కళ్యాణం టాపిక్ ఎందుకు వచ్చిందంటే దీపిక పదుకొనే - రణవీర్ సింగ్ వివాహం వల్ల.

ఇటలీ లోని లేక్ కోమోలో ఇద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకొని దంపతులయ్యారు.  రణవీరు సింగు గారు దీపిక ఫ్యామిలీ సాంప్రదాయమైన కొంకణీ స్టైల్లో తన ప్రియురాలిని షాదీ చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటి అంటే.. సింధీ స్టైల్ లో వెడ్డింగ్.  దాని సంగతి పక్కన బెడితే.. నూతన దంపతులకు ప్రపంచంలోని నలుమూలల నుండీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషెస్ లో చిలిపి శుభాకాంక్షలు కూడా ఉంటాయి కదా.  ముఖ్యంగా కండోమ్ కంపెనీల వారు విషెస్ పేరుతో చెడుగుడు ఆడుకుంటారు. ఒకవైపు శుభాకాంక్షలు చెప్పినట్టు ఉంటుంది.. మరో వైపు పబ్లిసిటీకి పబ్లిసిటీ.  

ఒక కంపెనీ విష్ ఇలా ఉంది "దీపిక & రణవీర్లకు అధికారికంగా దానికి రింగ్ తొడుగుతున్నందుకు కంగ్రాట్స్". రింగ్ ఏంటో.. అధికారికం ఏంటో మీ ఊహకే.   మరో కండోమ్ బ్రాండ్ తమ వివిధరకాల కండోమ్ ల ఫోటో పెట్టి "డియర్ దీప్ - వీర్ వార్డ్ రోబ్ రెడీగా ఉంది" అన్నారు.  ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇక ఒక నెటిజనుడు మాత్రం ఆయన్ను ఊరికే దీప్ వీర్ అనకండి.. ఇప్పుడాయన 'డీప్ వీర్' అన్నాడు. శివ శివా.. పొద్దున్నే  బూతు పురాణం రాయాల్సి వచ్చింది!


Tags:    

Similar News