ఈ ఆరబోత.. ఆధిపత్యం చూపించడానికా!!

Update: 2016-06-28 17:30 GMT
ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ కి మకాం మార్చేసింది. అంటే బాలీవుడ్ కి సంబంధించినంత వరకూ టాప్ హీరోయిన్ ప్లేస్ ఖాళీగానే ఉంది. ప్రియాంక రూట్ ని ఫాలో అవుతూ దీపికా పదుకొనే కూడా హాలీవుడ్ సినిమా చేస్తోంది కానీ.. మరీ పీసీ రేంజ్ లో అయితే ఫేమ్ ఇంకా రాలేదు. అందుకే ముందు బాలీవుడ్ టాప్  హీరోయిన్ అనే ప్లేస్ కి దీపిక ఎర్త్ పెట్టినట్లుగా అనిపిస్తోంది.

తన ఆధిపత్యం ప్రదర్శించడానికి రీసెంట్గా స్పెయిన్ లో జరిగిన ఐఫా ఈవెంట్ ని వేదికగా చేసుకుంది. ఈ ఫంక్షన్ లో అమ్మడి డ్రస్సులు చూడాలి... కను రెప్పలు వేస్తే ఏం మిస్ అయిపోతామా అన్నంత రేంజ్ లో అందాల ఆరబోసేసింది దీపిక. ఏదో నామ్ కే వాస్తే ఒక చోట మినహాయిస్తే.. క్లీవేజ్ ఎక్స్ పోజ్ చేయని డ్రస్ ఒక్కటంటే ఒక్కటి కూడా వేయలేదు ఈ సుందరాంగి. మామూలుగా కూడా బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్స్ పోజ్ చేయడం కామనే కానీ.. ఇక్కడ దీపిక మాత్రం.. ఒకే ఈవెంట్ లో అరడజన్ డిజైనర్ డ్రస్సుల్లో రెచ్చిపోయింది.

దేనికదే స్పెషల్ అయినా.. అన్నింటిలోనూ ఒకటే కామన్ పాయింట్. అదే తన సొగసులను ప్రదర్శనకి పెట్టేయడం. ఇదంతా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ కి తన కంటే పెద్ద పోటీ మరెవరూ లేరని చెప్పడానికే అన్నట్లుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి దీపికకు ఆ రేంజ్ ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయ్ లెండి.
Tags:    

Similar News