పార్టీ.. పొట్టి గౌన్.. పద్మావతి..

Update: 2017-05-26 09:51 GMT
బాలీవుడ్ స్టార్స్ అందరికీ మంచి మిత్రుడు కరణ్  జోహర్ బర్త్ డే నిన్న రాత్రి అతని స్వగృహం లో సన్నిహితులు, ఫిల్మ్ ఫ్రెండ్స్ , తోటి ఫిల్మ్ మేకర్స  మధ్య వేడుకలా జరిగింది. కరణ్ ఆహ్వానం మన్నించి అతినికి బాగా దగ్గర సంబంధం ఉన్న  స్టార్స్ వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. షబానా అజ్మీ, అనిల్ కపూర్, వరుణ్ ధావన్, అలీయ బట్ లాంటి కొందరు  స్టార్స్ సోషల్ మీడియా ద్వారా తమ మెచ్చే మిత్రుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక సెక్సీ సైరన్ దీపికా పదుకొనె.. స్పెషల్ గా కరణ్ జోహర్ కు ఇంటికి వెళ్ళి ఆ సంతోషం లో భాగమైంది. కానీ అక్కడుకు వచ్చిన దీపికా అందరి గుండెలును కొల్లగొట్టింది. రెడ్ కార్పెట్ పై నడిచి బాగా అలవాటైనట్లు ఉంది ఫ్యాషన్ అందుకే కరణ్ పార్టీ కి పొట్టి గౌన్ వేసుకొని హై స్కూల్ పోరి మాదరి కనిపించింది. హై హీల్స్ వేసుకొని బ్లాక్ ఔట్ ఫిట్ ఫుల్ నెక్ టాప్ లో ఇలా ఫోజ్ ఇచ్చింది. నేను ఏంటో ఇప్పుడు అర్ధమైందా అన్నట్లు చూస్తుంది కదూ.  

ఈ మధ్యనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచి అందరి మెప్పును పొందింది. వరుసగా నడిచిన రెండు రోజులూ కూడా అదరగొట్టేసింది. ఇంటర్నేషనల్ కాస్మెటిక్ బ్రాండ్ కోసం వాక్ చేసిన డింపల్ బ్యూటీ ఆ సెక్సీనెస్ ను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నట్లుంది. ఇకపోతే ఇప్పుడు దీపిక  సంజయ్ లీలా భన్సాలి తీస్తున్న 'పద్మావతి'లో నటిస్తోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News