బాలీవుడ్ భారీ చిత్రాల డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తీసిన లేటెస్ట్ మూవీ పద్మావతి ఇంకా వివాదాల్లోంచి బయటకు రావడం లేదు. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా తీశారంటూ ఆందోళనలు చేయడమే కాదు... పద్మావతిగా నటించిన దీపికా పదుకొనే ప్రాణం తీస్తామంటూ కొందమంది ఆవేశంతో ఊగిపోతున్నారు. దీంతో దీపిక ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ సీనియర్ నటి ‘దీపికా బచావో’ పేరిట కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఓ పిటీషన్ రెడీ చేసింది.
దీపికాకు మద్దతుగా బాలీవుడ్ నటులు ఈ పిటీషన్ పై సంతకాలు పెడుతున్నారు. కానీ హీరోయిన్ కంగన రనౌత్ మాత్రం తాను సంతకం పెట్టనని తేల్చిచెప్పింది. దీపికాతో విభేదాల వల్లనే ఆమె ఇలా మాట్లాడుతోందనే మాటలు రావడంతో దీనిపై కంగనా స్పందించింది. తాను దీపికాకు మద్దతు ఇస్తాను కానీ అది సొంత కండిషన్స్ కు అనుగుణంగానే ఇస్తానని అంటోంది. ‘‘షబానా ఆజ్మీ తయారు చేసిన పిటీషన్ గురించి నా ఫ్రెండ్ అనుష్క శర్మ ఫోన్ చేసి సంతకం చేయమని అడిగింది. ఓ నటిగా దీపికాకు మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధమే. కానీ ఓ రాజకీయ నాయకురాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో చేసే పనికి నేను సపోర్ట్ చేయను. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై నాకో అవగాహన ఉంది. ఈ ఓ పేరున్న పెద్ద మనిషితో వివాదం ఏర్పడినప్పుడు నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వాళ్లు నడిపిస్తున్న దీపికా బచావో మూమెంట్ ను నేను ఎలా సమర్ధించగలను. ఇదే మాట అనుష్కకు చెప్పా. తను నా మాటల్లోని భావాన్ని అర్ధం చేసుకుంది’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది కంగన.
పద్మావతి వివాదంలో దీపికా నా వ్యక్తిగత మద్దతు ఉంటుంది. ఎవరి మద్దతు లేకుండా సపోర్ట్ ఎలా చేస్తారో నా సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది అంటూ కంగనా తన మాటగా చెబుతోంది. మొత్తానికి కంగనా పద్మావతి సినిమాను కూడా తన వివాదానికి బాగానే ముడెట్టిందిగా.