బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే. ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల నుండి బడా సినిమాలకు.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఆమె హీరోయిన్ ప్రధమ ఆప్షన్ గా నిలుస్తుంది. అందుకే బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ముద్దుగుమ్మగా ఈ అమ్మడు నిలిచింది. ఇలాంటి దీపిక పదుకునే సౌత్ లో నటింపజేసేందుకు పలువురు స్టార్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే.
త్వరలోనే ప్రభాస్ తో సినిమా షూటింగ్ లో ఆమె జాయిన్ అవ్వబోతుంది. ఇక తాజాగా మరో సౌత్ సినిమాకు ఆమె ఓకే చెప్పింది. భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో మళ్లీ రజినీకాంత్ తో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొచ్చాడియన్ సినిమా లో దీపిక పదుకునే అప్పట్లో రజినీకాంత్ తో నటించింది. అయితే ఆ సినిమా 3డి సినిమా అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఆమె అభిమానులు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ రజినీకాంత్ తో కలిసి ఆమె నటించేందుకు సిద్దం అయ్యింది.
తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దేశింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రజినీకాంత్ తదుపరి సినిమా ఉండబోతుందట. ఆ సినిమా కోసం దీపిక పదుకునేను హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. రికార్డు స్థాయి బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందించే ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ను అతి త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు.
అన్నాత్తే షూటింగ్ ను ముగించిన రజినీకాంత్ దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ కొత్త సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అవ్వబోతుంది. దీపిక పదుకునే ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో ఆమె సౌత్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.