పొట్టి బ‌ట్ట‌ల్ని చీల్చి చెండాడిన గురుడు.. ధీటైన కోటింగ్ ఇచ్చిన దీపిక‌!

Update: 2022-02-01 04:30 GMT
చిట్టి పొట్టి నిక్క‌ర్లు.. బికినీలు పొడుగుకాళ్ల సుంద‌రి దీపిక ప‌దుకొనేకి కొత్తేమీ కాదు కానీ... పెళ్లాయినా త‌ర్వాతా ఎక్క‌డా త‌గ్గేదేలే! అంటూ చెల‌రేగుతుంటే యూత్ ఈ విష‌య‌మై త‌న‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గెహ్ర‌యాన్ ట్రైల‌ర్ లో చెల‌రేగి యువ‌హీరోతో లిప్ లాక్ లు లాగించేస్తూ రొమాన్స్ చేసిన తీరుకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక చిట్టి పొట్టి నిక్క‌ర్లు మినీ స్క‌ర్టుల్లో దీపిక ఓపెన్ మైండ్ స్పేస్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

గత వారం రోజులుగా.. దీపికా పదుకొణె.. అనన్య పాండే ... సిద్ధాంత్ చతుర్వేది  గెహ్రాయాన్ ను ప్రమోట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. వీరంతా అల్ట్రా మోడ్ర‌న్ లుక్స్ తో మ‌తులు చెడ‌గొడుతున్నారు. ఇక కుర్ర నటి అన‌న్య‌తో పోటీప‌డుతూ దీపిక పొట్టి దుస్తుల్లో క‌నిపిస్తూ వేడెక్కించేస్తోంది. భామ‌లు చెల‌రేగుతుంటే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫ్రెడ్డీ బర్డీ స‌ద‌రు నటీమణుల పొట్టి దుస్తుల‌ను ఎగతాళి చేశాడు. ఫ్రెడ్డీ ప్రముఖ ఇన్ స్టాగ్రామ్ పేజీని నడుపుతున్నారు. అనుష్క శర్మ- కరీనా కపూర్ సహా చాలా మంది ప్రముఖులు అతనిని అనుసరిస్తున్నారు. అతను ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. ``న్యూటన్స్ లా ఆఫ్ బాలీవుడ్. గెహ్రైయాన్ విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ బట్టలు మరింత చిన్నవిగా మారుతాయి. క్యాప్షన్ లో .. నెక్ లైన్ లు .. హెమ్ లైన్ లు గెహ్రాయన్‌లు`` అంటూ కామెంట్ ని రాశారు. కొద్దిసేపటికే దీపిక దీనిపై న‌ర్మ‌గ‌ర్భంగా స్పందించింది.

``విశ్వం ప్రోటాన్లు.. న్యూట్రాన్లు .. ఎలక్ట్రాన్లతో తయారైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వారు మూర్ఖుల గురించి చెప్పడం మర్చిపోయారు`` అని ఇన్ స్టా కథనంలో పేర్కొంది. ఆమె #IYKYK’ స్టిక్కర్ ను కూడా జోడించింది. ఎక్రోనిం అంటే .. మీకు తెలిస్తే... తరువాత.. ఫ్రెడ్డీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో తన పోస్ట్ ను పంచుకుని ``దీపికా పదుకొనే కెరీర్ మొత్తంలో మొదటి నకిలీ కాని వ్యాఖ్య`` అని రాశారు.

ఇంతలో మృణాల్ ఠాకూర్ ఫ్రెడ్డీ పోస్ట్ ను లైక్ చేసారు. ఇది దీపికా అభిమానులకు అస్స‌లు నచ్చలేదు. కోపంతో ఉన్న అభిమాని ఆమెను సోషల్ మీడియాలో దూషించాడు. మృణాల్ పై ఎటాక్ చేశాడు.``భాయ్ మీరు చాలా మానసిక అనారోగ్యంతో ఉన్నారు. నేను మీకు కొన్ని పువ్వులు తెచ్చి మీ ముఖం మీద కొట్టి.. ద్వేషాన్ని వ్యాప్తి చేసినందుకు ధన్యవాదాలు! నేను దీపికను మెచ్చుకుంటున్నాను అని మీకు తెలియజేయడానికి. ఇంట్లో కూర్చొని ద్వేషాన్ని వ్యాప్తి చేయడం కంటే.. ప్రేమను పంచడం కంటే.. మీరు జీవితాన్ని పొందాలని నేను భావిస్తున్నాను!`` అని రాసారు.
Tags:    

Similar News