ఫెమీనా లుక్: అక్కా చెల్లెళ్ల‌లా క‌లిసిపోయారు

Update: 2020-01-24 11:43 GMT
రీల్ కోసం స్నేహితులు అయ్యారు. అయితే ఆ స్నేహం అక్క‌డితో ఆగిపోలేదు. రియ‌ల్ లైఫ్ లోనూ స్నేహంగా మారింది. స్నేహం వ‌ర‌కేనా? అంటే.. అక్క చెల్లెళ్ల‌ను మించిన అనుబంధం కొన‌సాగుతోంది ఇపుడు. అందాల దీపిక ప‌దుకొనేకు సొంత చెల్లెలు కంటే ఎక్కువే అయ్యింది యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్.

ల‌క్ష్మీ అగ‌ర్వాల్ బ‌యోపిక్ చ‌పాక్ లో న‌టించిన దీపిక ఒక ర‌కంగా ఆ పాత్ర‌లో జీవించింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. న‌టిగా దీపిక మ‌రో మెట్టు ఎక్కింది. ఒక‌ రియ‌ల్ యాసిడ్ బాధితురాలి ఆవేద‌న‌ను త‌న‌లో ఇముడ్చుకుని ఎంతో ఎమోష‌న్ ని ర‌గిలించింది. ఈ సినిమా క‌థ‌ను ఎంతో ఇష్ట‌ప‌డి త‌నే నిర్మాత‌గా మారి రూపొందించింది. రాజీ ఫేం.. జాతీయ అవార్డ్ గ్రహీత మేఘ‌న గుల్జార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో దీపిక న‌ట‌న‌కు క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

తాజాగా రియ‌ల్ లైఫ్ ల‌క్ష్మీతో రీల్ లైఫ్ ల‌క్ష్మీ ప్ర‌ఖ్యాత ఫెమీనా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫోటోషూట్ లో పాల్గొంది. ప్ర‌స్తుతం ఆ క‌వ‌ర్ పేజ్ యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. దీపిక .. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ న‌వ్వులు చిందిస్తూ ఒక‌రినొక‌రు హ‌త్తుకుని ఉన్న ఆ ఫోటో హృద‌యాల్ని ట‌చ్ చేస్తోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అక్కా చెల్లెళ్ల అనుబంధం మైమ‌రిపిస్తోంది. ల‌క్ష్మీతో దీపిక ఎంత‌గా క‌లిసిపోయిందో ఆ హ‌గ్ చెబుతోంది. యాసిడ్ ఎటాక్ కి గుర‌య్యాక‌ ల‌క్ష్మీ అగ‌ర్వాల్ ఎంత‌గా ఆవేద‌న చెందిందో గుర్తు చేసుకుని మ‌రీ స‌క్సెస్ వేడుక‌ల్లో దీపిక క‌న్నీరు పెట్టుకుంది. త‌న ఎమోష‌న్ అంత ప‌ర్ఫెక్ట్ గా కుద‌ర‌డానికి కార‌ణం ల‌క్ష్మీ అందించిన స‌హ‌కార‌మేన‌ని వెల్ల‌డించింది. షూటింగ్ ఆద్యంతం ఎమోష‌న‌ల్ గానే సాగింది. ఆ ఎమోష‌న్ ఇంకా అలానే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. దీపిక న‌టించిన త‌దుప‌రి చిత్రం 83 రిలీజ్ కి రానుంది.


Tags:    

Similar News