గ్లాడియేటర్ సినిమా చూసినవాళ్లు ఓ ఫైట్ సీన్ అస్సలు మర్చిపోలేరు. ఓ పెద్ద కొలాషియం.. చుట్టూ ప్రేక్షకులు .. మధ్యలో ఓ ఫైటింగ్ రింగ్... చతురస్రాకారంలో ఉండే ఆ రింగ్ కి నాలుగు వైపులా పులులు గొలుసులకు కట్టేసి ఉంటాయి. అక్కడ బానిస వీరుడు శత్రువుతో పోరాడాల్సి ఉంటుంది. పులులు మీది మీదికి ఉరుకుతుంటాయి. అదుపుతప్పి పక్కన పడితే అంతే సంగతి. పులి పంజా రుచి చూడాల్సిందే. ఖతమ్ అవ్వాల్సిందే. అలాంటి కండిషన్ లో ఫైట్ చేయాలి.
అసలు వినడానికే గగుర్పొడిచేలా ఉంది కదూ! చూసినవాళ్లకు ఇంకా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. ఇలాంటి అసాధారణ ఫీట్ వేశారు కాబట్టే గ్లాడియేటర్ హాలీవుడ్ సినిమా హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే సేమ్ టు సేమ్ ఇప్పుడు అలాంటి ఫీట్ నే వేస్తోంది పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొన్. ప్రస్తుతం అమ్మడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న భాజీరావ్ మస్తానీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. రెమో డిసౌజా కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాటలో ముగ్గురు కనిపిస్తారు. దీపిక, రణబీర్, ప్రియాంక.. ఆ ముగ్గురు. కానీ మధ్యలో ఓ ఫ్రేమ్ హఠాత్తుగా సర్ ప్రైజ్ చేస్తుంది. దీపిక పదుకొన్ వయ్యారం ఒలకబోస్తూ నడుము ఊపుకుంటూ నడుచుకుంటూ వస్తుంటుంది. అయితే తనతో పాటే ఇరువైపులా రెండు పులులు నడిచి వస్తుంటాయి. అదీ షాట్.
అయితే ఈ ఫ్రేమ్ లో దీపిక ఒక్కత్తే ఉంటుంది. వెలుపల ఉన్న రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా నోళ్లు చాపుకుని చూస్తుంటారు. బాప్‌రే వింటుంటేనే గగుర్పొడుస్తోంది కదూ? డిప్స్ కి ఎన్ని గుండెలో మరి. కాని గ్రాఫిక్స్ పులులు వాడకుండా ఇలా రియల్ పులులను వాడితే సెన్సార్ వారు ఒప్పుకుంటారా?