ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే మరో మాట లేకుండా దీపికా పదుకొనే పేరు చెప్పేయొచ్చు. గత ఏడాది తమాషా.. బాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలతో తన స్థానాన్ని మరింత పదిలపరుచుకుంది దీపిక. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఆమే. ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయి హాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా తన వెంట పడే పరిస్థితి వచ్చింది.
హాలీవుడ్ అవకాశాలు ఇంతకుముందే వచ్చినా దేన్నీ ఒప్పుకోని దీపిక.. గత ఏడాదే ‘ట్రిపులెక్స్’ సిరీస్ లో తెరకెక్కబోయే కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. ‘ట్రిపులెక్స్’కు సంతకం చేశాక బాలీవుడ్ సినిమాలేవీ ఒప్పుకోలేదామె. పూర్తిగా ఆ సినిమాకే అంకితమైంది. ఆమె తీరు చూస్తే మళ్లీ ఇండియన్ సినిమా ఏదీ చేయదేమో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఎట్టకేలకు ఆమె బాలీవుడ్ ను కరుణించింది. ఓ హిందీ సినిమా ఒప్పుకుంది. ఆ సినిమా పేరు.. పద్మావతి.
దీపికతో రామ్ లీలా.. బాజీరావ్ మస్తానీ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు తీసిన సంజయ్ లీలా బన్సాలీ రూపొందించబోయే కొత్త సినిమా ఇది. ఇందులో కూడా రణ్వీర్ సింగే కథానాయకుడిగా నటించబోతున్నాడు. ఇది ఓ చారిత్రక నేపథ్యంతో తెరకెక్కబోయే సినిమా. బన్సాలీకి.. దీపికకు రణ్వీర్ కు మరో మైలురాయిలా ఈ సినిమా నిలిచిపోతుందని భావిస్తున్నారు. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తారట.