వెండి తెరపై అందంగా.. హుందాగా హీరోగా లేదా హీరోయిన్ గా కనిపించే వారి రియల్ లైఫ్ లో ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వాటిని ఎదురించలేక చనిపోతున్నారు.. మరి కొందరు మాత్రం ఆ ఇబ్బందులను ఎదిరించి నిలిచి స్టార్స్ గా నిలబడి రియల్ స్టార్స్ గా పేరు దక్కించుకుంటున్నారు. ఎంతో మంది స్టార్స్ కూడా డిప్రెషన్ తో బాధ పడుతున్నట్లుగా ఈమద్య కాలంలో వింటూ వస్తున్నాం. డిప్రెషన్ వల్లే గత ఏడాది యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి చెందిన విషయం తెల్సిందే. అదే తరహా డిప్రెషన్ ను తాను కూడా ఎదుర్కొన్నాను అంటూ బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే చెప్పుకొచ్చింది. 2014 సంవత్సరంలో నేను చాలా డిప్రెషన్ కు గురి అయ్యాను. ఆ సమయంలో చావాలనే కోరిక నాకు బలంగా కలిగేది. ఆ కోరిక పై నెలల తరబడి పోరాటం చేసి బయట పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది.
రాత్రి పడుకునే సమయంలో ఉదయం లేచిన వెంటనే ఒక శూన్యంలో ఉంటున్న ఫీల్ కలిగేది. ప్రతి రోజు ఉదయాన్నే ఎందుకు ఈ జీవితం అన్నట్లుగా నాకు నేను అనుకునేదాన్ని. నా జీవితం ఎందుకు అనే ఆలోచన కలిగేది. ప్రతి రోజు పని చేయాలంటే ఇష్టం ఉండేది కాదు. చాలా సందర్బాల్లో షూట్స్ ను తప్పించుకునేందుకు ప్రయత్నించాను. ఎన్నో సందర్బాల్లో జనాలతో కలిసేందుకు ఇబ్బంది పడేవాడిని. మొత్తంగా జీవితంలో చాలా చాలా ఇబ్బందులు ఆ సమయంలో పడ్డాను. ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో నాకు ఇష్టం లేనివారుగానే కనిపించారు. ఆ సమయంలో బెంగళూరు నుండి అమ్మా నాన్న నన్ను చూసేందుకు ముంబయి వచ్చారు. వారు బెంగళూరు తిరిగి వెళ్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసేందుకు వెళ్లి కన్నీరు పెట్టుకున్నాను. ఆ సమయంలో అమ్మ నన్ను అర్థం చేసుకుని డాక్టర్ ను కన్సల్ట్ అవ్వు అంటూ సలహా ఇచ్చింది.
ఆ క్షణంలోనే నా మానసిక పరిస్థితి బాగు పర్చుకోవడంకు డాక్టర్ ను కలవాలని భావించాను. వెంటనే డాక్టర్ ను కలిశాను. డిప్రెషన్ నుండి బయట పడటం కోసం నెలలకు నెలలు కౌన్సిలింగ్ తీసుకున్నాను. నాకు నేనుగా చాలా విషయాల్లో సర్దిచెప్పుకుంటూ ఎంతో మంది జీవితాలను ఆదర్షంగా తీసుకుంటూ ముందడుగు వేయాలని భావించాను. చాలా స్ట్రగుల్ మరియు ఒత్తిడి తర్వాత నేను మళ్లీ మామూలు మనిషిని అయ్యాను. ఈ క్రమంలో నాకు కొందరు సహకరించారు అంటూ చెప్పుకొచ్చింది.
దీపిక 2014 లో డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం ఏంటీ అనేది మాత్రం చెప్పలేదు. ఆమె ప్రేమ వ్యవహారం అయ్యి ఉంటుంది అంటూ కొందరు బాలీవుడ్ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. ఆ సమయంలో ఆమె బ్రేకప్ అయ్యిందని... అతడి మోసం ను తట్టుకోలేక చనిపోవాలని కూడా అనుకుంది అంటూ కొందరు ఆమె సన్నిహితులు కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. మొత్తానికి దీపిక కమ్ బ్యాక్ ఎంత గ్రాండ్ గా రిచ్ గా ఉందో ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. ఇండియాలో టాప్ స్టార్ హీరోయిన్ ఆమె అనడంలో ఏమాత్రం సందేహం లేదు. త్వరలో మన తెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో రాబోతున్న విషయం తెల్సిందే.