కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అంతా మర్చిపోయినా పాత వివాదమే మళ్లీ చిక్కుల్లోకి నెట్టింది. వివారాల్లోకి వెళ్తే.. ఇటీవల విజయ్ పై మైసూర్ విమానాశ్రయంలో మహా గాంధీ అనే వ్యక్తి దాడిచేయగా..విజయ్ మేనేజర్ ప్రతిదాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విజయ్ సేతుపతి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఇది చిన్న విషయమని..తాగిన మైకంలో గొడవ చేసాడు తప్ప ఏం లేదని తేల్చేసారు. అయితే సదరు వ్యక్తి తాను ఎలాంటి మద్యం తీసుకోలేదని...విజయ్ ని మంచి నటుడని ప్రశంసిస్తే పట్టించుకోకుండా హేళనగా మాట్లాడటమే కాకుండా కొట్టి వెళ్లిపోయాడని.. తనపై దాడి చేసారని ఆరోపించారు.
అయితే తాజాగా మహా గాంధీ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. విజయ్ సేతుపతిపై పరువు నష్టం దావా వేసాడు. ఎయిర్ పోర్టులో జరిగిన అసలు స్టోరీని మరోసారి ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. విజయ్ ని నటన బాగుందని ప్రశంసించాను. కానీ వారు పట్టించుకోలేదు. ప్రతిగా దాడికి దిగారు. విజయ్ మేనేజర్ తీవ్రంగా కొట్టాడు. నా చెవికి గాయమైంది. ప్రస్తుతం చెవి కూడా పనిచేయడం లేదు. దీనికి వారంతా మూల్యం చెల్లించాలి. అందుకే పరువు నష్టం దావా వేసాను. అలాగే అసలు విషయాన్ని దాచిపెట్టి కట్టు కథలు అల్లారు. నిజంగా వారికి చిత్త శుద్ది ఉంటే..నాదే తప్పు ఉంటే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అని ప్రశ్నించారు.
మొత్తానికి మహాగాంధీ ఆవేదనలో అర్ధం ఉందనిపిస్తోందని నెటి జనులు అతనికి మద్దతునిస్తున్నారు. దావా వేశారు కాబట్టి కోర్టులో నిజా నిజాలు నిగ్గు తేల్తాయి. అటుపై తప్పెవరిదో తేలిపోతుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ మంచి పాత్రలు దక్కుతున్నాయి.