ట్రెండింగ్: కదిలిస్తున్న నిర్బయ వెబ్ సిరీస్

Update: 2020-05-21 11:10 GMT
అది 2012.. డిసెంబర్ 16.. నిర్భయపై కదిలే బస్సులో దారుణంగా అత్యాచారం చేసి వివస్త్రగా రోడ్డు పక్కన పడేశారు. బస్సులోనే ఒకరి తర్వాత మరొకరు ఆరుగురు రేప్ చేశారు. సున్నితమైన ఆమె ప్రాంతాల్లో రాడ్డు కూడా దింపడంతో నిర్భయ తీవ్ర అస్వస్థతకు గురైంది. టోల్ ప్లాజా సిబ్బంది స్థానికుల సాయంతో సప్తార్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన దేశాన్ని కుదేపిసింది. ఢిల్లీ రణరంగమైంది. నిర్భయపై అత్యాచారం చేసిన వారిని ఉరితీయాలని జనాలు, యువత రోడ్డెక్కారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కు నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తరలించింది. నిర్భయ చికిత్స పొందుతూ డిసెంబర్ 29 న చనిపోయింది.

2012 నుంచి నిర్భయ తల్లి పోరాడుతూనే ఉంది.కానీ నిర్భయ హంతకుల ఉరితీత ఆలస్యమైంది. కోర్టులు, నిబంధనలతో ఎనిమిదేళ్లుగా నిర్భయ నిందితులు ఉరిని జాప్యం చేశారు. కానీ ఎట్టకేలకు ఉరితీయబడ్డారు. నిర్భయపై రేప్ జరిగినప్పటి నుంచి నిందితుల పట్టివేత, ఆందోళనలు, ఆమె మరణం.. హంతకుల ఉరితీత వరకు ఎన్నో మలుకులు, దారుణాలు.. ఇంతటి కన్నీటి కథను తాజాగా కథగా మలిచారు. నెట్ ఫ్లిక్స్ లో దీన్ని వెబ్ సిరీస్ గా వేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘ఢిల్లీ క్రైమ్’ ట్రైలర్ నిర్భయ ఉందంతాన్ని కళ్లకు కట్టింది.

ఈ మొత్తం ఎపిసోడ్ తో దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యానికి చోటు ఉండకూడదని ‘నిర్భయ చట్టం’ కూడా వచ్చింది. అయినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో దేశాన్ని కుదిపేసి కదిలించిన ‘నిర్భయ’పై తాజాగా తీసిన ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్ ఆకట్టుకుంది. మంచి రివ్యూలు వస్తున్నాయి. కాస్త స్లో కంటెంట్ అనిపిస్తున్నా.. సందర్భానుసారం ఉద్వేగంగా.. ఉత్కంఠగా తీశారని చెప్పకతప్పదు.

ఢిల్లీ క్రైమ్ ట్రైలర్
Full View
Tags:    

Similar News