దిల్లీ నిర్భయ అత్యాచారంపై సిరీస్ కి అరుదైన‌ అవార్డ్

Update: 2020-12-02 01:30 GMT
అంత‌ర్జాతీయ సినీయ‌వ‌నిక‌పై ఎమ్మీ అవార్డ్స్ కి ఉన్న ప్రాధాన్య‌త గురించి తెలిసిన‌దే. 2020 ఎమ్మీ అవార్డ్స్ ని నేడు ప్ర‌క‌టించారు. నెట్ ‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ అంత‌ర్జాతీయ ఎమ్మీ అవార్డ్ తో మెరుపులు మెరిపించింది. షెఫాలి షా - రాజేష్ తైలాంగ్‌తో పాటు షో రచయిత దర్శకుడు రిచీ మెహతా - హెచ్ ‌టి సిటీ ఎడిటర్ మోనికా రావల్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2020 లో ఉత్తమ డ్రామా సిరీస్ ‌కు అవార్డును గెలుచుకోవడంపై ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ అవార్డు గురించి వారంతా మాట్లాడారు.

నెట్‌ఫ్లిక్స్ ‌లో మార్చి 2019 లో విడుదలైన ఈ సిరీస్ 2012 లో దిల్లీ(ఢిల్లీ)లో జరిగిన దారుణమైన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు ఆధారంగా రూపొందించారు. షా మ‌హిళా అధికారి ఇన్ ‌చార్జిగాను.. వర్తికా చతుర్వేది, తైలాంగ్ భూపేంద్ర సింగ్ పాత్రలో నటించారు.

ఈ సిరీస్ కి ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సీజ‌న్ 2 ని తెర‌కెక్కించే ఉత్సాహంతోనూ ఉన్నారు. ఎమ్మీ ఉత్త‌మ సిరీస్ అవార్డుతో మ‌రింత ఉత్సాహంగా టీమ్ ప్లాన్ చేస్తోంద‌ట‌.
Tags:    

Similar News