భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె ఈ లోకం విడిచి వెళ్లి యావత్ గాన ప్రియులను శోక సంద్రంలో ముంచారు. ముంబైలో జరిగిన లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సహా ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మరణానికి నివాళులర్పించారు. అయితే లతా మంగేష్కర్ మధ్యప్రదేశ్లో జన్మించారు. ఆమె తండ్రి ఓ డ్రామా కంపెనీ నడిపేవారు. అలా ఊరూరా వెళుతుండగా ఇండోర్ కు వచ్చిన సందర్భంగా లతా జన్మించారు. లతా ఒకప్పుడు జన్మించిన ఇల్లు లేదు. అయితే వాడకు సంబంధించిన వాళ్లంతా ఆమె పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిక్ మొహల్లా ప్రాంతంలో లతా మంగేష్కర్ 1929లో జన్మించారు. లతా జన్మించిన కొద్ది రోజులకు ఆమె కుటుంబం ఇండోర్ వదిలివెళ్లింది. ఆ తరువాత వారికి సంబంధించిన ఇల్లును కూల్చివేసి వస్త్ర దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని కోర్టు వాలీ గల్లీ అని పిలుస్తారు. ఇక స్నాక్స్ దుకాణాలు ఎక్కువగా ఉండడంతో చాట్ వాలీ గల్లీ అనికూడా పేర్కొంటారు. అయితే ఈ వీధికి లతా మంగేష్కర్ పేరు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె పేరు పెట్టాలని ఎప్పటి నుంచో అడుగుతున్నామని స్థానికులు అంటున్నారు.
లతా మంగేష్కర్ ఇంటిని కూల్చివేసిన ప్రాంతలో ఓ వస్త్ర దుకాణం వెలిసింది. ఈ దుకాణం యజమాని లతామంగేష్కర్ పై ఉన్న అభిమానంతో ఓ ఫొటోనుకూడా పెట్టుకున్నారు. దీంతో ఆ వీధి మొత్తం లతా మంగేష్కర్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఆమె ఆదివారం మరణించినందన్న వార్త తెలియగానే కన్నీటి నివాళులర్పించారు. అంతేకాకుండా అప్పటి నుంచి తమ ప్రాంతానికి లతా పేరు పెట్టాలని కోరుతున్నారు.
ఇక లతా మంగేష్కర్ తెలుగులో రెండు పాటలను పాడారు. ‘సంతానం’ సినిమాలోని నిదురపోనాన్నా.. ‘ఆఖరి పోరాటం’లో మరో పాటను పాడారు. లతా మంగేష్కర్ మరణవార్త తెలియగానే ఆమె గురించి నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. ఆమె తెలుగులో పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాన కోకిల ఇక మన మధ్య లేదనే విషయం జీర్చించుకోలేకపోతున్నామని కొందరు పోస్టులు పెడుతున్నారు.