టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్....ఇలా అన్ని `వుడ్`లలో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. సినిమా చిన్నదా...పెద్దదా అన్న తేడా లేకుండా కంటెంట్ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతున్నారు. చిన్న చిత్రాలకు కూడా పెద్దపీట వేసి బ్లాక్ బస్టర్ హిట్స్ చేస్తున్నారు. తెలుగులో వచ్చిన క్షణం ,పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి - RX100 వంటి చిత్రాలు చిన్న గా వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. కోలీవుడ్ లో వచ్చిన అరువి కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈ తరహాలో వచ్చిన చిన్న చిత్రాలు కేవలం కమర్షియల్ హిట్ లుగా మిగిలిపోవడమే కాకుండా....ఫిల్మ్ ఫెస్టివల్స్ కు కూడా ఎంపికవుతున్నాయి. తాజాగా, ఇలా రూపొంది....ఇంకా విడుదల కాని ఓ చిన్న చిత్రం...ఏకంగా యూఎస్ ఏలోని ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది.
బాహుబలి - రంగస్థలం.....ఈ తరహాలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు....ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికవడం విశేషం కాదు. అయితే, విడుదలకు ముందే ఓ చిన్న సినిమా అమెరికాలోని ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలకు ఎంపికై అరుదైన ఘనత దక్కించుకుంది. అలీ తమ్ముడు ఖయ్యూమ్ హీరోగా నటించిన `దేశంలో దొంగలు పడ్డారు` చిత్రం `బ్లాక్ బీర్ (“Black Bear” Milford,USA)`ఫిల్మ్ ఫెస్టివల్ కి అధికారికంగా నామినేట్ అయ్యింది. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో గౌతమ్ రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ చిత్రం....విడుదలకు ముందే అరుదైన ఘనత దక్కించుకోవడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.