రివ్యూయ‌ర్ల‌పై దేవ్ క‌ట్టా రివ్యూ!

Update: 2018-08-20 10:09 GMT
ఓ సినిమా విజ‌యంలో రివ్యూలు ఎంత కీల‌క పాత్ర పోషిస్తాయో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఓ సినిమాను చూడ‌బోయే ముందు ఫిల్మ్ క్రిటిక్స్ ఇచ్చే రేటింగులు - రివ్యూలు ప్రేక్ష‌కుల‌పై ప్ర‌భావం చూపిస్తున్నాయి. అయితే, రివ్యూయ‌ర్ల‌పై ఇండ‌స్ట్రీ వాళ్లు ద్వంద్వ ప్ర‌మాణాలు మెయింటెన్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. త‌మ సినిమా హిట్ అయిన‌ప్పుడు రివ్యూయ‌ర్ల‌ను మెచ్చుకోవ‌డం....అదే , నెగ‌టివ్ లేదా మిక్స్ డ్ టాక్ వ‌చ్చిన‌పుడు స‌మీక్ష‌కుల‌ను విమ‌ర్శించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆ నెగ‌టివ్ రివ్యూల వ‌ల్లే త‌మ సినిమా ప్లాప్ అయింద‌ని....బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పించిన సంద‌ర్భాలు అనేకం. అయితే, సినిమాలో కంటెంట్ ను బ‌ట్టే రివ్యూలిస్తున్నామ‌ని...రివ్యూయ‌ర్లు వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఫిల్మ్ క్రిటిక్స్ సై విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు దేవ్ క‌ట్టా...ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

సినిమావాళ్లు త‌మ‌కు న‌చ్చిన విష‌యాన్ని - తాము చెప్ప‌ద‌లుచుకున్న దానిని సినిమా రూపంలో చూపిస్తున్నార‌ని...అదే త‌ర‌హాలో రివ్యూయ‌ర్లు కూడా..రివ్యూలు రాస్తున్నార‌ని దేవ్ అభిప్రాయ‌ప‌డ్డారు. సినీ రివ్యూలు రాసేవారికి అది ఓ వృత్తి అని అన్నారు. విభిన్న అంశాలు తీసే హ‌క్కు సినిమావారికి ఉన్న‌ట్లుగానే....సినిమాల‌పై వారి అభిప్రాయాన్ని చెప్పే హ‌క్కు రివ్యూయ‌ర్ల‌కుంద‌ని అన్నారు. వాస్త‌వానికి - సినిమాను స‌మీక్షించడం...రివ్యూ రాయ‌డం అనేది ఓ రంగంగా ఎంచుకున్న వారు చాలామంది ఉన్నారు. ఓ ర‌కంగా చెప్పాలంటే ప్ర‌తి సినిమాకు స‌మీక్ష‌కుడే మొద‌టి ప్రేక్ష‌కుడు. అప్ప‌టికీ, రివ్యూ రాసిన త‌ర్వాత‌...ఇది కేవ‌లం ఒక సమీక్ష‌కుడి అభిప్రాయం మాత్రమే అని బాట‌మ్ లైన్ ఉంటుంది. అస‌లు ఒక్క ముక్క‌లో చెప్పాలంటే....రివ్యూయ‌ర్లు - ప్రేక్ష‌కులు వేరు కాదు.
Tags:    

Similar News