విడుదలకు ముందు చాలా క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న నాగార్జున నానిల మల్టీ స్టారర్ దేవదాస్ ఆ మేరకు అంచనాలు నిలబెట్టుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతోంది. వీక్ ఎండ్ ని ఓ మాదిరిగా వాడుకున్నా నిన్నటి నుంచి ఆశించినట్టే డ్రాప్ ఉండటం యూనిట్ ని టెన్షన్ పెడుతోంది. ఇవాళ నేషనల్ హాలిడే కాబట్టి బాగానే వర్క్ అవుట్ చేసుకోవచ్చు కానీ రేపటి నుంచి మాత్రం పెద్ద సవాలే కళ్ళముందు ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే ఓవర్సీస్ లో సైతం ఏమంత మెరుగ్గా లేకపోవడం అభిమానులను ఖంగారు పెడుతున్న అంశం.
ఇలాంటి మాస్ ప్లస్ క్లాస్ సినిమాలకు సాధారణంగా అక్కడ రన్ బాగుంటుంది. పైగా సీనియర్ స్టార్ నాగార్జునతో పాటు అక్కడి మార్కెట్ మీద పట్టున్న న్యాచురల్ స్టార్ నాని తోడు. ఇంకేం డాలర్ల పంటే అనుకున్నారు అందరు. కానీ దానికి భిన్నంగా రేపటితో వారం పూర్తి కాబోతున్నా ఇప్పటి దాకా మిలియన్ డాలర్ క్లబ్లోకి ఎంటర్ కాలేదని యుఎస్ ట్రేడ్ రిపోర్ట్. మరో రెండు మూడు రోజుల్లో అందుకున్నా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి అది సరిపోదు.
దేవదాస్ ఇప్పుడు రెండు చోట్లా ఎదురీదుతోంది. డిజాస్టర్ అనిపించుకోలేకపోయినా దీని మీద ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులు అధిక మొత్తంలో ఉండటంతో ఆ లెక్కలను బట్టే ఇది హిట్టా ఫ్లాపా అనేది డిసైడ్ అవుతుంది. టాక్ పూర్తిస్థాయిలో పాజిటివ్ గా మారకపోవడం కూడా ప్రభావం చూపిస్తోంది. ఇంత రేంజ్ ఉన్న హీరోలను సరిగా డీల్ చేయగలడా అనే అనుమానాలు నిజం చేస్తూ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దేవదాస్ ని తీర్చిదిద్దిన తీరుపై నాగ్ ప్రీ రిలీజ్ లో చెప్పిన మాటలకు బలం చేకూరింది.
దేవదాస్ విడుదలయ్యే సమయానికి చెప్పుకోదగ్గ పోటీ ఏది లేదు. మణిరత్నం నవాబ్ టార్గెట్ వేరు కాబట్టి స్ట్రెయిట్ సినిమాగా వచ్చిన దేవదాస్ మంచి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకోలేదు. మిలియన్ డాలర్ చేరుకోవడానికి వారం పడితే మొత్తం రాబట్టడానికి ఇంకో రెండు వారాలు కావాలి. కానీ ఆ లోపే నోటా-అరవింద సమేత వీర రాఘవ వచ్చేస్తాయి. ఆపై మరో వారం గ్యాప్ లో హలో గురు ప్రేమ కోసమే-పందెం కోడి 2 రెడీ అవుతున్నాయి. సో దేవదాస్ నష్టాల శాతం ఎంత తగ్గొచ్చు అనేది మాత్రమే ఇప్పుడు ఎదురుచూడాల్సిన అంశంగా మారింది.