అక్కినేని బ్రాండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కుర్ర హీరోల్లో సుశాంత్ కూడా ఒకడు. ఎనిమిదే ఏళ్లలే మూడు సినిమాలు మాత్రమే చేసినా.. అన్నింటిలోనూ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. డ్యాన్సులు కూడా బాగా చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడీ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆటాడుకుందాం..రా. ఇప్పుడీ సినిమా షూటింగ్ ని ఫినిషింగ్ స్టేజ్ కి తెచ్చారు కానీ.. రీసెంట్ గా పిక్చరైజ్ చేసిన ఓ పాట టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
ఏఎన్నార్ దేవదాసు మూవీలో 'పల్లెకు పోదాం.. పారును చూదాం.. చలో చలో' అనే పాట టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటి. తమ వంశంలోని సీనియర్ హీరోలకు చెందిన పాత పాటలను రీమిక్స్ చేసే ట్రెండ్ టాలీవుడ్ లో ఉన్నా.. మరీ క్లాసిక్స్ జోలికి.. ఆ కాలం నాటి పాటల జోలికి వెళ్లే సాహసం అందరూ చేయలేదు. కానీ సుశాంత్ మాత్రం దేవదాసు పాటను రీమిక్స్ చేసేస్తున్నాడు. ఇప్పటికే ఈ పాట షూటింగ్ కూడా పూర్తయిపోయిందని తెలుస్తోంది. అంత మంచి పాటను ఈ కుర్ర హీరో ఎలా తీసుంటాడో అనే ఆసక్తి టాలీవుడ్ లో నెలకొంది.
ఇక్కడ అందరూ చెబుతున్న మాట ఏంటంటే.. సుశాంత్ ఆ పాటకు కొత్త విలువలు అద్దకపోయినా.. కనీసం ఒరిజినల్ కి ఉన్న వాల్యూను చెడగొట్టకుండా ఉంటే చాలు అంటున్నారు. అయితే.. సుశాంత్ నటించిన మూడు సినిమాలను గమనిస్తే.. చాలా విషయాల్లో ఈ హీరో అలర్ట్ గా ఉంటాడనే విషయం అర్ధమవుతుంది. మరి ఈ దేవదాసులోని క్లాసిక్ సాంగ్ ఔన్నత్యాన్ని సుశాంత్ నిలబెడతాడని కోరుకుందాం.