దేవిశ్రీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు

Update: 2015-12-15 07:13 GMT
దేవిశ్రీ ప్రసాద్ అంటే ఓ హుషారు.. ఓ ఎనర్జీ. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు ఈ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి వాడిని పొగిలి పొగిలి ఏడుస్తుండగా చూడటం ఎవరికైనా బాధ కలిగించే విషయమే. నిన్నటి నుంచి అలాగే ఏడుస్తున్నాడు దేవి. తండ్రి చనిపోతే ఎవ్వరైనా బాధపడతారు, ఏడుస్తారు లెండి. ఐతే తండ్రితో బాగా అటాచ్ మెంట్ ఉన్న దేవి ఇంకా ఎక్కువగా ఆవేదన చెందుతున్నాడు.

తమ్ముడు సాగర్ కొంత ధైర్యంగా ఉన్నా.. పాపం దేవి మాత్రం నిలవలేకపోయాడు. తండ్రి నిశ్చలంగా ఉండటం చూసి విలవిలలాడిపోయాడు. నన్ను వదిలేసి వెళ్లిపోయాడు చూడండి అంటూ పాపం చిన్నపిల్లాడిలా బోరున ఏడ్చేశాడు. తండ్రి చనిపోయినపుడు దేవి పక్కన లేడు. స్టూడియోలోనో మరెక్కడో ఉన్నాడు. తండ్రి మరణించిన సంగతి తెలిసి ఇంటికి పరుగు పరుగున వచ్చాడు. ఇక తండ్రిని అలా చూశాక తట్టుకోలేకపోయాడు. ఆ విజువల్స్ చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి.

దేవికి తండ్రితో ఎంత అనుబంధం ఉందన్నది అందరికీ తెలిసిందే. చిన్న తనంలోనే అతడి టాలెంట్ గుర్తించి టీనేజీలోనే మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి ఎంతో తోడ్పాటునందించాడు సత్యమూర్తి. తండ్రి మీద తనకున్న ప్రేమను చాటుకుంటూ తన ఆడియో ఫంక్షన్లకు ఆయన్ని తీసుకొచ్చేవాడు దేవి. కొన్నేళ్లుగా ఆరోగ్యం బాలేకున్నా చక్రాల కుర్చీలో తండ్రిని ఫంక్షన్లను తీసుకొచ్చేవాడు. ఆయన గురించి మాట్లాడి.. ఆయన ముందు పెర్ఫామ్ చేసే ఎంటర్టైన్ చేసేవాడు. తన కొడుకు ఎదుగుదల చూసి చాలా సంతోషించేవారు సత్యమూర్తి. తనకో ఫ్రెండులా, గైడ్‌ లా ఉన్న తండ్రి తనను విడిచి వెళ్లిపోయేసరికి తట్టుకోలేకపోతున్నాడు దేవి.

Tags:    

Similar News