సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. మార్చ్ 30న విడుదలకు షెడ్యూల్ చేసిన ఈ మూవీకి.. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. హీరో చరణ్.. హీరోయిన్ సమంత క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్లు ఇచ్చేశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి తొలి లిరికల్ సాంగ్ కూడా వచ్చేసింది.
'ఎంత సక్కగున్నావే' అంటూ సాగే పాటను విడుదల చేసింది రంగస్థలం యూనిట్. చంద్రబోస్ రాసిన లిరిక్ ఎంత బాగుందో.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ అంతకంటే అద్భుతంగా ఉంది. చాలు సులువైన అచ్చ తెలుగు పదాలను ఏరి ఎంపికచేసి మరీ కూర్చిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. అంత మంచి పాటకు డీఎస్పీ క్యాచీ ట్యూన్ ఇవ్వడమే కాకుండా.. తనే పాడి మరీ అలరించాడు. రాక్ స్టార్ మ్యూజిక్ ఇస్తే హిట్ అవడం సహజమే కానీ.. చాలారోజుల తరువాత దేవిశ్రీప్రసాద్ చాలా మంచి పాటతో వచ్చాడనే సంగతి అర్ధమవుతుంది.
30 ఏళ్ల క్రితం పల్లెటూరి వాతావరణాన్ని సుకుమార్ ఆవిష్కరిస్తే.. దానికి ప్రాణం పోసే బాధ్యతను దేవిశ్రీ చేపట్టాడనే సంగతి అర్ధమవుతూనే ఉంది. సుకుమార్ అండ్ చరణ్ దగ్గరుండి మరీ ఇలాంటి ఔట్ పుట్ తెచ్చుకునే వరకూ తపించారని చెప్పేయవచ్చు. లేటెస్ట్ మ్యూజిక్ ఎంత ట్యాలెంట్ తో అందిస్తాడో.. అంతకు మించి ఈ పాటలో సంగీతం అలరిస్తుంది. అసలు దేవిశ్రీ ఈ రేంజులో ఎలా కంపోజ్ చేశాడబ్బా? అనే డౌట్ రావడంలో తప్పే లేదు. అంత అద్భుతంగా కుదిరేసింది 'ఎంత సక్కగున్నావె'.