వరుణ్ తేజ్ తన కెరీర్ ఏడాది తిరగకుండానే మూడు సినిమాలు చేసేశాడు. ముకుంద - కంచె - లోఫర్ సినిమాలను ఏడాది లోపే రిలీజ్ చేసి స్పీడ్ చూపించాడు. తొలి రెండు చిత్రాలతో ఆకట్టుకున్నా.. లోఫర్ నిరాశపరచిన తర్వాత, కొత్త ప్రాజెక్ట్ మాత్రం బాగా లేట్ చేసేశాడు. మరోసారి కంచె కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ క్రిష్ డైరెక్షన్ - ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా 'రాయబారి' చేస్తాడని అనుకున్నా.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. రద్దయిపోయినట్లు రీసెంట్ గా తేలిపోయింది కూడా. అయితే మెగా ప్రిన్స్ తో రాయబారిని నిర్మిద్దామని అనుకున్న నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ని ఫైనలైజ్ చేశాడు.
వెంకీ అట్లూరి ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. తీయనున్న సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కాంబినేషన్స్ కూడా క్రేజీగానే ఉన్నాయి. రాక్ స్టార్ అంటూ సౌత్ అంతా పొగిడేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. మొదటిసారి మెగా ప్రిన్స్ కి మ్యూజిక్ ఇవ్వనున్నాడట. వరుణ్ తేజ్-దేవిశ్రీ-దిల్ రాజు కాంబినేషన్ తో ఈ ప్రాజెక్ట్ కు ఇప్పటికే క్రేజ్ ఏర్పడిపోయింది.
త్వరలో హీరోయిన్ ని కూడా ఫైనలైజ్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు సిద్ధమవుతున్నాడు. వరుణ్ నుంచి మంచి సినిమాలు వస్తున్నా.. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ హీరో నుంచి ఓ బ్లాక్ బస్టర్ ఎదురుచూస్తున్నారు. దాన్ని దిల్ రాజు తీరుస్తాడని ఇప్పుడు హోప్స్ పెట్టుకుంటున్నారు.