సొంత వెబ్ సైట్‌ పెట్టుకుంటున్న దేవిశ్రీ

Update: 2016-05-14 08:12 GMT
టాలెంటెడ్ కంపోజర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ప్రస్తుతం రెండు ఐకానిక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి చిరంజీవి 150వ సినిమా అయితే.. రెండోది బాలకృష్ణ 100వ చిత్రం. ఈ రెండు సినిమాలే చాలా ముఖ్యమే. అయితే ఈ గ్యాప్‌ లో మనోడు ఒక వెబ్ సైట్‌ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏంటది?

సాధారణంగా మ్యూజిక్‌ డైరక్టర్లు ఏదన్నా వెబ్‌ సైట్‌ పెడుతున్నారంటే.. అందులో వారు ఖచ్చితంగా వారి చరిత్ర.. ఫోటోలు.. అవార్డులు.. పాటలు.. వగైరా వగైరా విషయాలు పెడతారు. అయితే పాప్‌ సింగర్లు వంటి వారు.. ఈ వెబ్‌ సైట్లు పెట్టకుండా ఆన్ లైన్ లో చక్కగా యుట్యూబ్‌ ఛానల్‌ లో తమ పాటలను ఉంచుతారంతే. కాని దేవిశ్రీ ప్రసాద్‌ పెట్టే వెబ్‌ సైట్‌ వీటికి సంబంధించింది కాదు. మనోడు ఎప్పుడు ఖాళీ దొరికినా.. లేదా ఏదన్నా ఊరెళ్ళినా.. వెంటనే అక్కడ తన డిజిటల్‌ కెమెరాతో బోలెడన్ని ఫోటోలు తళుక్కుమనిపిస్తాడట. ఎప్పటికప్పుడు లేటెస్టు ఫోటోగ్రాఫి కెమెరాలు.. ఇతర ఎక్విప్ మెంట్లు కొంటూనే ఉంటాడట. అయితే తాను తీసిన ఫోటోలన్నీ ప్రజలకు చూపించేది ఎలా?

ఏదో ట్వీట్టర్‌ లో ట్వీట్ చేసినా.. లేకపోతే ఫోటో ఎగ్జిబిషన్‌ పెట్టినా.. ఎక్కువమందికి రీచ్‌ అవ్వదు కాబట్టి.. దేవిశ్రీ ఒక వెబ్ సైట్‌ పెడితే బెటర్‌ అనే కంక్లూజన్‌ కి వచ్చేశాడట. త్వరలోనే ఈ వెబ్ సైట్‌ ను లాంచ్‌ చేయనున్నట్లు తెలిపాడు.
Tags:    

Similar News