దేవిశ్రీ తెలుగువాడే కానీ.. అతను పని చేసేది తమిళ గడ్డ నుంచి. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చేశాక అందరూ చాలామంది మకాం ఇక్కడికి మార్చేశారు కానీ.. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మాత్రం చెన్నైలోనే స్థిరపడ్డాడు. దేవి టాలీవుడ్లో గొప్ప పేరు సంపాదించి.. బిజీ అయినా సరే.. అతను కూడా తండ్రితో పాటే చెన్నైలోనే ఉండిపోయాడు తప్ప హైదరాబాద్ రాలేదు. ఇప్పుడీ ప్రస్తావనంతా ఎందుకంటే.. తన సొంతగడ్డకు తాను పని చేస్తున్న సినిమా యూనిట్ వచ్చేసరికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు దేవి. వెంటనే ఆ సినిమా సెట్లో వాలిపోయి బొకే ఇచ్చి అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు. ఆ సినిమా మరేదో కాదు.. జనతా గ్యారేజ్.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘జనతా గ్యారేజ్’ కొత్త షెడ్యూల్ కోసం మొన్నే చెన్నైకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఇవాళ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాడు దేవి. హీరో ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాలను కలిసి వారికి విషెస్ చెప్పి ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. కొరటాలతో దేవి పని చేసిన మిర్చి.. శ్రీమంతుడు మ్యూజికల్ గానూ బ్లాక్ బస్టర్లే. ‘జనతా గ్యారేజ్’కు కూడా అతనే సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆడియో పని తుది దశలో ఉంది. ఇద్దరూ కలిసి ఇంతకుముందే ట్యూన్లు ఫైనలైజ్ చేశారు. జులైలో ‘జనతా గ్యారేజ్’ ఆడియో రిలీజయ్యే అవకాశముంది. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.