సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య ఇటీవలే తన భర్త ధనుష్ కు విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. పెళ్లి అయ్యి ఇన్నాళ్లు అవుతుంది.. ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత వీరిద్దరు విడి పోవడం వెనుక ఉన్న కారణం ఏంటీ అంటూ అంతా కూడా అనుమానం వ్యక్తం చేశారు. వీరిద్దరు పిల్లల కోసం మళ్లీ కలుస్తారనే వార్తలు కూడా ఆమద్య వచ్చాయి. కాని అవన్నీ కూడా ఒట్టి పుకార్లే అని తేలిపోయింది.
వీరిద్దరు విడాకుల ప్రకటన చేసిన సమయంలో ఆ తర్వాత కూడా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేశారు. ఆ సమయంలో వారిద్దరు కూడా కలుసుకోవడం కాని.. మాట్లాడుకోవడం కాని చేయలేదట. తాజాగా వీరిద్దరు చెన్నైలో ఒక కామన్ ఫ్రెండ్ పార్టీ లో పాల్గొన్నారట. తక్కువ మంది పాల్గొన్న ఆ పార్టీ లో వీరిద్దరు కూడా పాల్గొనడం వల్ల ఖచ్చితంగా మాట్లాడుకుంటారని అంతా భావించారు.
పార్టీ జరిగినంత సమయం అంటే దాదాపుగా మూడు నాలుగు గంటల పాటు కూడా వారిద్దరు ఒకరిని ఒకరు కనీసం చూసుకోవడం... నవ్వుతూ పలకరించుకోవడం కాదు కదా కనీసం హాయ్ అని కూడా అనుకోలేదట. ఇద్దరి మద్య ఎంత పెద్ద వైరం ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటూ పార్టీకి వచ్చిన వారు అంటున్నారు. పార్టీ లో ఎవరికి వారే అన్నట్లుగా ఇద్దరు ఉండటం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం ను కలిగించిందట.
పార్టీ లో హాజరు అయిన ఒక వ్యక్తి తమిళ మీడియా తో మాట్లాడుతూ వారిద్దరు కూడా పూర్తిగా పార్టీని ఎంజాయ్ చేశారు. కాని వారు ఇద్దరు ఒకరికి ఒకరు తెలియనట్లుగానే పలకరించుకోకుండా ఉన్నారు. పార్టీ జరుగుతున్నంత సమయం చాలా మంది వారిద్దరు ఎదురు పడి మాట్లాడుకుంటారేమో అని.. ఇద్దరు పలకరించుకుంటారేమో అని భావించారు. కాని అదేం జరగలేదు.
ధనుష్ మరియు ఐశ్వర్య లు ఇద్దరు కూడా ఇన్నాళ్లు సంసార జీవితం సాగించి ఇప్పుడు ఉన్నట్లు ఉండి ఇంతగా దూరం అవ్వడం అందరికి ఆశ్చర్యం ను కలిగిస్తుంది. తమ ఇద్దరు పిల్లల కోసం వారు స్నేహితులుగా ఉండటం మంచిదని కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారట. కాని వారు కనీసం స్నేహితులుగా కూడా ఉండలేక పోతున్నారని తాజా పార్టీ తో వెళ్లడయ్యిందని తమిళ మీడియా కథనాలను బట్టి అర్థం అవుతోంది.
బాలీవుడ్ కు చెందిన హృతిక్ రోషన్ మరియు ఆయన భార్య విడాకులు తీసుకున్నా కూడా పిల్లల కోసం మరియు కుటుంబం కోసం ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటున్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ తమ స్నేహ బందంను కొనసాగిస్తున్నారు. అలాగే ధనుష్ మరియు ఐశ్వర్య లు కూడా పిల్లల కోసం స్నేహంగా ఉండటం మంచిది అనేది అందరి అభిప్రాయం.