అల్లుడు ధ‌నుష్ కొత్త ఇంటి భూమి పూజ‌లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్

Update: 2021-02-11 04:30 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ .. ఆయ‌న అల్లుడు ధ‌నుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో వ‌రుస షూటింగుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీ ప్ర‌స్తుతం అన్నాథే షూటింగులో బిజీ. మ‌రోవైపు ధ‌నుష్ బాలీవుడ్ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తూ బిజీ.

శివ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాథే పూర్తి చేయ‌గానే ర‌జ‌నీ పేట ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని స‌మాచారం. ఈ గ్యాప్ లోనే ర‌జ‌నీ ఓ కొత్త ఇంటి భూమి పూజా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఇది ఎవ‌రిది? అంటే.. అల్లుడు ధ‌నుష్ నూత‌న గృహ పూజా కార్యక్ర‌మం కావ‌డం విశేషం. ధనుష్ చెన్నైలోని ఖరీదైన పోయెస్ గార్డెన్ ప్రాంతంలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. భూమి పూజా వేడుకలో రజనీకాంత్ పాల్గొన్నారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత వేద ఇల్లం (హోమ్) - సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు రాఘ‌వ‌వీర అవెన్యూస్- పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్నాయి. ధనుష్ ఇటీవలే ఈ ప్రాంతంలో భూమిని కొని తన కొత్త ఇంటి నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించాడు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో త‌లైవా ఎంతో ఉల్లాసంగా క‌నిపించారు.

ఇంత‌కుముందు అన్నాథే హైద‌రాబాద్ షూట్ లో ఉన్నప్పుడు చిత్ర‌యూనిట్ కి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో షూటింగుకి బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త కార‌ణంగా గతేడాది డిసెంబర్ లో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు.  ఆ త‌ర్వాత ఆయ‌న‌ ఒక కార్యక్రమానికి రావడం ఇదే మొదటిసారి. ర‌జ‌నీ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. వైద్యుల సలహాలను అనుసరించి రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించకూడదని నిర్ణయించుకున్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ నిర్ణయంతో అభిమానులు తీవ్రంగా నిరాశ‌ప‌డ్డారు.
Tags:    

Similar News