రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవికి రోల్స్ రాయిస్‌ని పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు అంటే.. ఔరా! ఖరీదైన కానుకే.. అని సామాన్య జనం ముచ్చట్లాడుకున్నారు. అయితే ఈరోజుల్లో సెలబ్రిటీల ఇళ్ల ముందు రోల్స్ రాయిస్ పప్పీల్లా కాపలా కాస్తున్నాయి. టాలీవుడ్ హీరోలు - డైరెక్టర్లు - ప్రొడ్యూసర్ల ఇళ్ల ముందు రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు కనిపిస్తూనే ఉన్నాయి. 6 నుంచి 10 కోట్ల రేంజు ఖరీదైన బ్రాండెడ్ కార్లు ఇవి.
కోలవుడ్ లోనూ ఏ.ఆర్.రెహమాన్, డైరెక్టర్ శంకర్, ఇలయదళపతి విజయ్ .. వీళ్లంతా రోల్స్ రాయిస్ లోనే శికారు చేస్తుంటారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా ఓ రోల్స్ రాయిస్ కొనుక్కున్నాడు. కొనాలి అనుకుంటే అది అతడికి పెద్ద విచిత్రం కాదు కానీ, ఇప్పటికి తనకి ఆ అర్హత వచ్చింది అని భావించినట్టున్నాడు. నేను కూడా ఓ రోల్స్ రాయిస్ కొనుక్కున్నా .. అని ఇన్నాళ్టికి సంబురంగా చెప్పుకుంటున్నాడు.
ఇటీవల నడిగర సంఘం ఎన్నికల వేళ ధనుష్ 106 నంబర్ ఉన్న రోల్స్ రాయిస్‌లో రాజాలా దిగొచ్చి ఓటేసి వెళ్లాడు. మొత్తానికి రజనీకాంత్ అల్లుడు అయిపోగానే ఇలాంటి కార్లు గట్రా కొనేసేయొచ్చు.. కాని ఇప్పటివరకు కొనకుండా మాంచి పనే చేశాడు. సొంతంగా తనే కొనుక్కొని ఇండివుడ్యుయాలిటీ చాటుకున్నాడు. అదీ మ్యాటరు.