విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న కథానాయకుడు శ్రీవిష్ణు త్వరలో 'తిప్పరా మీసం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుండి 'దేత్తడి' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు పూర్ణాచారి. నరేష్ మామిండ్లతో కలిసి ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి పాడారు. "మాసు బీటే మోగిందిరా మామ నాటు స్టెప్పే వేసెయ్యారా జోరుదారుగా ఉందామురా జరా జోరు తగ్గితే బేకారురా" అంటూ హైదరాబాది స్టైల్లో సాగింది. సింపుల్ పదాలతో ఇంట్రెస్టింగ్ గా ఉంది పూర్ణాచారి సాహిత్యం. ఇక ఈ పాటకు సురేష్ బొబ్బిలి ఓ ఊపు ఉండే డీజే మిక్స్ టైపు ట్యూన్ అందించారు. ఈ పాటకు క్యాచ్ ఫ్రేజ్ 'దేత్తడి తడి తడి పోచమ్మ గుడి' అనేది ఎంచుకోవడంతో స్పెషల్ గా మారింది. మొదటిసారి వింటే సాధారణంగా అనిపించవచ్చు కానీ వినేకొద్ది మనం కూడా "..తడి తడి పోచమ్మగుడి" అని హమ్మింగ్ చేయాల్సిందే.
ఇప్పటికే డిఫరెంట్ టైటిల్.. శ్రీవిష్ణు గెటప్ తో ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం ఈ మాసు పాట విషయంలో కూడా మంచి మార్కులే తెచ్చుకుంది. ఫ్యూచర్ లో ఈ పాట డీజేల్లో వినిపించడం పక్కానే. దేర్ కిస్ బాత్ కీ.. దేఖో దేత్తడి..!
Full View