హిట్ మూవీని రీమేక్ చేస్తున్నారంటే స్టోరీనే కాదు మ్యూజిక్ ను కూడా యాజ్ ఇట్ ఈజీగా దించేయడానికే ఆసక్తి చూపిస్తుంటారు మన దర్శక నిర్మాతలు. అల్రెడీ హిట్ సాంగ్స్ ఇక రిస్క్ ఎందుకని అవే ట్యూన్స్ వినిపించే ప్రయత్నం చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్. సేమ్ టెక్నిషియన్స్ రిపీట్ అయితే సహజంగా ఇదే జరుగుతుంది. కానీ హిప్ హాప్ తమిళ్ ఆది మాత్రం తెలుగు డెబ్యూట్ కి డేర్ అటెంప్ట్ చేశాడు. చెర్రీ ధృవ ఆల్బమ్ కి అన్ని కొత్త ట్యూన్స్ ఇచ్చాడు. తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకునే ప్రయత్నం ఆది మ్యూజిక్ లో చాలా సిన్సియర్ గా కనిపిస్తోంది.
అర్థరాత్రి అఫీషియల్ గా రిలీజైన ధృవ సాంగ్స్ అప్పుడే ఛార్ట్ బస్టర్స్ అయిపోయాయ్. ఆల్బమ్ లో మొత్తం నాలుగు సాంగ్స్ ఉంటే దేనికదే హిట్ ట్రాక్ లా వినిపిస్తోంది. చూశా చూశా సాంగ్ అయితే క్యాచీగా ఉండి వినగానే ఎక్కేసింది చాలామందికి. ఇక ధృవ టైటిల్ సాంగ్ అయితే అదిపోయిందనే చెప్పాలి. నీతోనే డ్యాన్స్- డ్యాన్స్ నంబర్ కాగా.. పరేషానురా సాంగ్ రొమాంటిక్ వన్ అని వినగానేఅర్థమైపోతుంది. ఇప్పటికే టీజర్స్ కూడా హంగామా చేస్తున్నాయ్ కాబట్టి ధృవ ఆల్బమ్ ఇన్ స్టాంట్ హిట్ అయిపోయిందని ఫిక్సైపోవచ్చు.
నిజానికి తనీ ఒరువన్ రీమేక్ చేస్తున్నారన్నప్పుడు పాటలు కూడా అలాగే దించేస్తారని చాలామంది ఊహించుకొన్నారు. అర్థమైనా- కాకపోయినా తమిళ్ సాంగ్స్ వినేశారు. ముఖ్యంగా కన్నాలే కన్నాలే సాంగ్ సూపర్ హిట్. ఆ పాటని తెలుగులో ఎలా కంపోజ్ చేస్తారా తేడా వస్తే విమర్శించేద్దామని రెడీ కూడా అయిపోయారు. కానీ ధృవలో మాత్రం అన్ని కొత్త ట్యూన్స్ వినిపించగానే అందరూ న్యూ సాంగ్స్ కి అడిక్ట్ అయిపోయారు. ఇక ఫ్యాన్స్ అయితే ఆరెంజ్ తర్వాత చెర్రీకి మంచి మ్యూజిక్ పడింది అంటున్నారు. కాకపోతే ట్యూన్స్ ని బట్టి మూవీలో పెద్ద డ్యాన్స్ లు మాత్రం ఉండవనే విషయం అర్థమై ఆ విషయంలో కొంచెం డిజపాయింట్ అవుతున్నారు. అయినా స్టోరీని బట్టి స్టెప్స్ కానీ స్టెప్స్ కోసం మూవీ కాదు కదా.. సో సాంగ్స్ ని ఎంజాయ్ చేయడమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/