50 క్లబ్ లో డిసెంబర్ సెన్సేషన్

Update: 2016-12-22 16:48 GMT
రామ్ చరణ్ మూవీ ధృవ.. ఇప్పటికి రెండు వారాల రన్ పూర్తి చేసుకుంది. స్థానికంగా డీమానిటైజేషన్.. ఓవర్సీస్ లో మైనస్ డిగ్రీల టెంపరేచర్.. ఈ రెండు సిట్యుయేషన్స్ టాలీవుడ్ ని వణికిస్తున్న పరిస్థితుల్లో ధృవ సంచలనం సృష్టించేసింది.

ధృవ ఇప్పుడు 50కోట్ల షేర్ కలెక్షన్స్ ను అధిగమించింది. అఫీషియల్ గానే మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసేశారు. ఈ మధ్య ఫిఫ్టీ క్రోర్స్ క్లబ్.. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ వసూళ్లు బెంచ్ మార్క్ అయిపోయాయి. కానీ ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కుని ధృవ ఈ మార్క్ లను అధిగమించింది. ఓవర్సీస్ లో ఇప్పటివరకూ ధృవకు వచ్చిన వసూళ్ల మొత్తం 1.3 మిలియన్ డాలర్లు. ఫుల్ రన్ పూర్తయ్యే సరికి 1.5 మిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నా.. క్రిస్మస్ తోపాటు వచ్చిన వీకెండ్ లో ఈ మూవీ ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నదే పాయింట్.

టాలీవుడ్ కి డిసెంబర్ అంతగా అచ్చివచ్చే నెల కాదు. ఇప్పటివరకూ డిసెంబర్ లో విడుదలైన ఏ సినిమా 50 కోట్ల మార్క్ కు చేరువగా కూడా రాలేదు. బ్యాడ్ సీజన్ అనే రిమార్క్ ను కూడా చెర్రీ తుడిచిపెట్టేశాడు. మొదటిరోజు వసూళ్లు చూసి భారీ చిత్రాలను రిలీజ్ చేయాలంటేనే భయపడ్డ టాలీవుడ్ కి.. రామ్ చరణ్ బోలెడంత ధైర్యం ఇచ్చాడు. ఫుల్ రన్ లో ధృవ 60కోట్లను అందుకోవడం ఖాయమని.. అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్స్ లోకి అడుగుపెడతారని ట్రేడ్ పండిట్స్ చెబుతుండడం విశేషం.
Tags:    

Similar News