ఆస్ట్రేలియాలోని తన భర్త విరాట్ కోహ్లి హోటల్ గదిలోని వీడియో ఆన్ లైన్ లో లీక్ కావడంతో బాలీవుడ్ నటి అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ప్రైవేట్ స్పేస్ లోకి చొరబడడంపై క్రికెటర్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇప్పుడు నటి దియా మీర్జా ఒక హోటల్ కు వెళ్లేటప్పుడు తాను ఎలా ఎక్కువ జాగ్రత్తగా ఉంటానో ఓపెన్ గా వెల్లడించింది.
``ఒక దశాబ్దం క్రితం నటీమణులు స్నానం చేస్తున్న వీడియోలు నెట్ లో కనిపించడంతో తాను జాగ్రత్తగా ఉన్నా``నని దియా చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో దియా తాను హోటల్ లోకి వెళ్లే ముందు ప్రోటోకాల్ ను అనుసరిస్తానని చెప్పింది. ఆమె వచ్చిన తర్వాత మాత్రమే గదిని కేటాయించమని హోటల్ వారిని కోరుతుంది. అందులో రహస్య కెమెరాలు ఉన్నాయా? లేదా? అని కూడా వెతుకుతానని తెలిపింది.
తన 40 ఏళ్ళ వయసులో ఉత్తమ పాత్రలు పోషించడం 'విముక్తి, సాధికారత' అని కూడా దియా అభిప్రాయపడింది. దియా మీర్జా 2001లో రెహనా హై టెర్రే దిల్ మే అనే రొమాంటిక్ డ్రామాతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. నటి కాకముందు ఆమె మోడల్ గా విజయవంతమైన కెరీర్ ను సాగించింది. మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ ను కూడా గెలుచుకుంది.
పరిణీత- లగే రహో మున్నా భాయ్- సంజు- తప్పడ్ వంటి చిత్రాలలో పాత్రలతో నటిగా తనకంటూ ఒక ముద్ర చూపించింది. దియా తదుపరిది సామాజిక రాజకీయ నాటకం భీద్ విడుదలకు సిద్ధమవుతోంది. తప్పాడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.