ఈ రోజుల్లో సినిమాను రొటీన్ గా ప్రమోట్ చేస్తే జనాలకు ఎక్కదు. ఎవ్వరూ చేయంది ఏదైనా చేస్తేనే జనాల దృష్టిని ఆకర్షించడం సాధ్యమవుతుంది. ‘డిక్టేటర్’ టీమ్ ఈ దిశగానే ఆలోచిస్తోంది. ముహూర్తం రోజు నుంచి సినిమాను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్న ‘డిక్టేటర్’ టీమ్.. ఆడియో ఫంక్షన్ విషయంలో డిఫరెంట్ రూట్ ఎంచుకుంది. ఎవ్వరూ ఊహించని వేదికలో ఆడియో వేడుక జరుపుకోవాలని యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో డిక్టేటర్ ఆడియో ఫంక్షన్ చేయబోతున్నట్లు యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. బాలయ్య అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పొలిటికల్ గా ఆలోచించినా కూడా అమరావతి ప్రత్యేకమైన వేదిక అవుతుందని భావించి.. అక్కడే ఆడియో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేయబోతున్నారట. బాలయ్యకు తెలంగాణ కంటే ఏపీ - సీడెడ్ లోనే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. పైగా బాలయ్య ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి ప్రాథినిత్యం వహిస్తున్నారు. అందువల్లే ఆయన ఏపీ రాజధాని అమరావతిని టార్గెట్ గా చేసుకున్నారని తెలుస్తోంది.
డిసెంబరు రెండో వారం లేదా మూడో వారంలో అమరావతిలో ‘డిక్టేటర్’ ఆడియో ఫంక్షన్ జరగొచ్చని సమాచారం. ఓ భారీ బహిరంగ వేదికలో ‘బాహుబలి’ తరహాలో ఆడియో వేడుక చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మళ్లీ తెలంగాణ ప్రేక్షకులకు దూరం కాకుండా హైదరాబాద్ లో ఓ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లాంటిదేదో చేస్తారట. ఐతే సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చాక కరెక్ట్ డేట్ ఫిక్స్ చేస్తారని అంటున్నారు.