నటసింహా బాలయ్యబాబు ధూం ధాం మొదలైంది. రేపట్నుంచే సంబరాలు మొదలెట్టేస్తున్నారు. నటసింహా కెరీర్ 99వ సినిమా డిక్టేటర్ ప్రచారం హడావుడి మొదలైపోతోంది. రేపు ఫస్ట్ లుక్ ని రిలీజ్ ఛేసేసి, ఈనెల 17న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలోని జైజై వినాయక పాటను ఆవిష్కరిస్తున్నారు. విఘ్నవినాయకుని ప్రాసస్థ్యానికి సంబంధించిన సాంగ్ ఇది. గణేషుని స్థుతించే పాట కాబట్టి ఈ పాటను వినాయక నిమజ్జనం వేళ ఆవిష్కరిస్తేనే బావుంటుందనేది దర్శక హీరోల ఆలోచన.
అందుకే ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనానికి ముందే పూజా కార్యక్రమాల్లో ఈ పాటను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు శ్రీవాస్ సహా యూనిట్ సభ్యులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఈ పాట లాంచింగ్ ని గణేషుని ఉత్సవ కమిటీ అడ్డుకుంటుదని అన్నారు. కానీ ఎలాంటి అడ్డంకులు లేవని యూనిట్ తేల్చి చెప్పిందిప్పుడు. యూనిట్ ఈపాటికే సమస్యని సాల్వ్ చేసుకుందని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. విఘ్నేషుని పాటను ఆవిష్కరించడానికంటే ముందే రేపు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే బాలయ్యబాబు సంక్రాంతి లక్ష్యంగా రావాలని నిర్ణయించుకున్నారు. 2016 సంక్రాంతికి తిరుగులేని విజయం సాధించాలని బాలయ్య తహతహలాడుతున్నారు. అందుకే ముందుగా వినాయకుని ఆశీస్సులు తీసుకుంటున్నారు.
డిక్టేటర్ ఎలాంటి విఘ్నాలు లేకుండా సెంచరీ కొట్టాలని మనసా వాచా కర్మణా బాలయ్యబాబు వినాయకుడిని ప్రార్థించనున్నారు. ఖైరతాబాద్ గణేషుని చెంత ఊక వేస్తే రాలనంత మంది జనం ప్రతియేటా విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో అయితేనే కిక్కొస్తుందని డిక్టేటర్ టీమ్ భావించింది. అనుకున్నదే తడవుగా ఆచరణలో చూపించడం నందమూరి స్టయిల్. అది సంగతి.