అక్కినేని అఖిల్ నాలుగో సినిమా ఇంకా పాతిక శాతం షూటింగ్ పూర్తి కాకుండానే ఐదో మూవీకి రంగం సిద్ధమైనట్టు ఫిలిం నగర్ టాక్. అ! - కల్కి లాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేసేందుకు అఖిల్ ఆసక్తి చూపిస్తున్నట్టు వినికిడి. కీలక పాత్రలో నివేదా థామస్ ని ఎంపిక చేసినట్టుగా వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక అప్ డేట్ అయితే ప్రస్తుతానికి లేదు.
ప్రశాంత్ వర్మ కొద్దిరోజుల క్రితం కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత సెట్ కాగానే సెట్స్ పైకి వెళ్తుందన్నట్టుగా టాక్ వచ్చింది. కానీ కాజల్ వరుస కమిట్ మెంట్స్ తో చాలా బిజీగా ఉన్న తరుణంలో అది చేయడం అనుమానమే. ఇప్పుడు అదే కథను అఖిల్ తో ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది . ఒకే తరహా మూస ప్రేమికుడి పాత్రలతో మూడు సినిమాలతోనే రొటీన్ అనిపించుకున్న అఖిల్ నిజంగానే ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులతో చేయడం మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
కానీ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది అనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ప్రశాంత్ వర్మ దీనికి సంబంధించి ఏ మాటా చెప్పడం లేదు కాబట్టి ఇది గాసిప్ గానే తీసుకోవాలి. అఖిల్ ప్రస్తుతం హాలిడే మీద స్పెయిన్ లో ఉన్నాడు. తిరిగి వచ్చేలోపు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మూవీకి హీరొయిన్ ఫిక్స్ అవుతుందో చూడాలి. అది కనీసం సగమయ్యాక ఐదో సినిమా క్లారిటీ వస్తుందేమో